Begin typing your search above and press return to search.

అపార్ట్ మెంట్ లో లేడీ సింగర్ డెడ్ బాడీ

By:  Tupaki Desk   |   6 Feb 2016 8:39 AM GMT
అపార్ట్ మెంట్ లో లేడీ సింగర్ డెడ్ బాడీ
X
యంగ్ అండ్ ఎనర్జటిక్.. టాలెంటెడ్ మలయాళీ సింగర్ కమ్ కంపోజర్ షాన్ జాన్సన్ మరణం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఆమె మృతదేహాన్ని ఆమె ఆపార్ట్ మెంట్లో గుర్తించారు. ప్రఖ్యాత సంగీత విద్యాంసుడైన జాన్సన్ కుమార్తె ఈ షాన్ జాన్సన్. పలు మలయాళీ చిత్రాలకు పాటలు పాడిన ఆమె.. అనూహ్యంగా మరణించటం ఇప్పుడు మిస్టరీగా మారింది. పలు అనుమానాలకు తావిస్తోంది.

ఒక రికార్డింగ్ ను ముగించుకొని తల్లితో పాటు కోచికి వెళ్లాల్సిన షాన్ అపార్ట్ మెంట్లో నిర్జీవంగా పడి ఉండటం గుర్తించారు. నిజానికి ఆమె తన తల్లితో కోచికి వెళ్లాల్సి ఉన్నారు. షాన్ రెండో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రయాణమవుతున్న సమయంలో మరణించటం గమనార్హం. ఆమె మొదటి పెళ్లి విఫలమైంది.

కూతురితో ఫోన్లో మాట్లాడేందుకు షాన్ తల్లి పలుసార్లు ప్రయత్నించినా ఫోన్ తీయకపోవటంతో.. వారికి తెలిసిన వ్యక్తిని షాన్ అపార్ట్ మెంట్ కు పంపారు. ఆ వ్యక్తి పలుమార్లు తలుపు కొట్టినా తీయకపోవటంతో అనుమానంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ షాన్ నిర్జీవంగా పడి ఉండటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మృతదేహాన్ని శవపరీక్షల కోసం పంపారు. ఆమె ఇంట్లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి లేఖ లభించలేదు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ సింగర్ ఆకస్మిక మృతి వ్యవహారం షాకింగ్ గా మారింది.