Begin typing your search above and press return to search.

హౌస్ లోకి ఎంట్రీకి ముందే ఎమోషనల్ గా ఓపెన్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   4 Sep 2022 5:25 AM GMT
హౌస్ లోకి ఎంట్రీకి ముందే ఎమోషనల్ గా ఓపెన్ అయిపోయాడు
X
ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యే రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. దేశం ఏదైనా.. ప్రాంతం మరేదైనా.. భాష ఇంకేదైనా.. బిగ్ బాస్ కాన్సెప్టు మాత్రం ప్రపంచ వ్యాప్తం అన్నట్లుగా.. అడుగు పెట్టిన ప్రతి చోటా తన హవా నడిపించటం తెలిసిందే. మిగిలిన దేశాల్లో మాదిరే భారత్ లోనూ బిగ్ బాస్ కాన్సెప్టు సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. తెలుగులో సీజన్ 6కు ఈ రోజే (ఆదివారం) శ్రీకారం చుట్టనుంది. ఈ రాత్రి బిగ్ బాస్ 6 అధికారికంగా షురూ కానుంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు? అన్న దానిపై లీకు రాయుళ్లు ఇప్పటికే బోలెడంత సమాచారం ఇచ్చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రాథమిక రూల్ కు భిన్నంగా ఒక కంటెస్టెంట్ వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరైనా సరే.. తమకు సంబంధించిన వివరాల్నిబిగ్ బాస్ అధికారికంగా రివీల్ చేసే వరకు బయటపెట్టకూడదు. అందుకు భిన్నంగా వ్యవహరించాడు సింగర్ కమ్.. ఇండియన్ ఐడల్ విజేత రేవంత్. హౌస్ లోకి అడుగు పెట్టినట్లుగా అధికారిక ప్రకటన వెలువడక ముందే.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు అయిన ఒక పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా తన అధికారిక ఇన్ స్టా అకౌంట్ లో తనను ఆశీర్వదించాలని.. తాను బిగ్ బాస్ టైటిల్ తో బయటకు రానున్నట్లుగా పేర్కొంటూ ధీమాను వ్యక్తం చేశారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు తమ సమాచారాన్ని బిగ్ బాస్ వెల్లడించటానికి ముందు వరకు రివీల్ చేయరు. అంతేకాదు.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మూడు నెలలకు పైనే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి బేసిక్ రూల్స్ కు భిన్నంగా హౌస్ లోకి అడుగు పెట్టినట్లుగా అధికారిక ప్రకటన రాక ముందే.. తాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా పెట్టిన పోస్టుపై బిగ్ బాస్ ఎలా రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని ఈ సిత్రం అనుకోకుండా జరిగిందా? బిగ్ బాస్ అనుమతితో జరిగిందా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.