Begin typing your search above and press return to search.
రైతుల నిరసనకు సింగర్ అండ.. రూ.కోటి విరాళం
By: Tupaki Desk | 6 Dec 2020 7:37 AM GMTఅనుకోని విపత్తులు చోటు చేసుకున్నప్పుడు సినిమా రంగానికి చెందిన వారితో పాటు.. పలువురు ప్రముఖులు తమకు తోచినంత సాయాన్ని ప్రకటిస్తుంటారు. రోటీన్ గా జరిగే ఈ తీరుకు కాస్త భిన్నంగా వ్యవహరించారు బాలీవుడ్ నటుడు కమ్ సింగర్ దిల్జిజ్ దోసంజ్. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక సినీ రంగ ప్రముఖులు.. సెలబ్రిటీ తనకు తానుగా బయటకు వచ్చి.. మీ ఆందోళనకు నేను మద్దతుగా ఉంటున్నా.. భారీ విరాళాన్ని ప్రకటించటం ఇటీవలకాలంలో ఎప్పుడైనా విన్నామా?
ఆ ముచ్చట తీర్చేశాడీ పంజాబీ నటుడు కమ్ గాయకుడు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్.. హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే.. వారికి తోడుగా ఇప్పుడు యూపీ రైతులు కలుస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు.. రైతు సంఘాలు ఈ దీక్షకు మద్దతు ఇస్తున్నాయి. వణికించే చలిలో రోడ్ల మీద గడిచిన పది రోజులుగా చేస్తున్న ఈ ఆందోళన మీద స్పందించిన దిల్జిత్.. వారికి తాను మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై దిల్జిత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తాను యూపీవాలా కాదని పంజాబీ రైతులమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం సాగింది. తాజాగా రైతులు చేస్తున్న ఆందోళనకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించటం ద్వారా ఇష్యూను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఏమైనా ప్రజాపోరాటానికి ఒక సెలబ్రిటీ ఓపెన్ గా ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వటం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు మరెన్ని తెర మీదకు రానున్నాయో?