Begin typing your search above and press return to search.

అమరావతి నుంచి వైదొలిగిన సింగపూర్!

By:  Tupaki Desk   |   12 Nov 2019 10:15 AM GMT
అమరావతి నుంచి వైదొలిగిన సింగపూర్!
X
అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ నుంచి సింగపూర్ వైదొలిగింది. ఈ విషయాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అధికారికం గా ప్రకటించారు. తద్వారా గత కొన్నాళ్లు గా ఉన్న ఊహాగానాల కు తెరదించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత సింగపూర్ భజన బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో ఎడాపెడా సింగపూర్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పట్లోనే అమరావతి ప్రాంతం లో భూములను సింగపూర్ కు తాకట్టుపెడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్త సాగింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాకా.. అమరావతి లో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ ను పక్కన పెట్టిన సంకేతాలు కనిపించాయి. ఈ నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు గా ఈశ్వరన్ మంగళవారం ప్రకటించారు.

రెండు వేల పదిహేడు లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ కు సింగపూర్ కన్సార్టియం తో ఒప్పందం కుదర్చుకుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం.. ఇరువురి పరస్పర అంగీకరం తోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు గా ఈశ్వరన్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతల ను అర్థం చేసుకుని తప్పుకుంటున్నట్టు గా వివరించారు.

ఈ ఒప్పందం రద్దు.. ఇండియా లోని ఇతర ప్రాజెక్టుల పై ప్రభావం చూపించదని సింగపూర్ కన్షార్టియం పేర్కొంది. ఇది చాలా చిన్నప్రాజెక్టు అని, దీని వల్ల పెద్ద ప్రభావం ఉండదని ఆ కంపెనీలు పేర్కొనడం గమనార్హం.