Begin typing your search above and press return to search.

సింధూ కోసం ఆమె తండ్రి ఇవి సిద్ధం చేశారు!

By:  Tupaki Desk   |   20 Aug 2016 7:31 AM GMT
సింధూ కోసం ఆమె తండ్రి ఇవి సిద్ధం చేశారు!
X
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకున్న పీవీ సింధుకు ఒక పక్క ప్రశంసలు - మరోపక్క కాసుల జల్లులు కురుస్తున్న వేల.. ఆమెకోసం మరోకొన్ని ప్రత్యేకతలు ఎదురుచూస్తున్నాయి. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధుకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు - బడా బడా కంపెనీలనుంచి బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింధూ కి వస్తున్నవి సరే.. సింధూకి కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు సూపర్ స్టార్ అయిపోయినా కానీ.. ఆమె కూడా అందరిలాంటి అమ్మాయే కదా! దీంతో బాలీవుడ్ సినిమాలన్నా - బిర్యానీ అన్నా తనకు ఎంతో ఇష్టం. అయితే ఒలింపిక్స్ కి సిద్ధమవుతున్న సమయంలో సినిమాలు చుసేటంత తీరికా ఉండదు, బిర్యానీలు తినే ఛాన్సూ ఉండదు. అయితే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం ఈ సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి.

ఈ విషయాలపై స్పందించిన పీవీ సింధూ తండ్రి రమణ.. ఈ విషయాలని మీడియాతో షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ సినిమాలంటే ఎంతో ఇష్టపడే సింధూకోసం "రుస్తుం" - "మహెంజోదారో" వంటి కొత్త సినిమాలు ఎదురుచూస్తున్నాయని, వాటికి తీసుకెళ్లమని సింధూ చాలా సార్లు అడిగిందని.. ఆమె హైదరాబాద్ రాగానే అవి చూపించాలని రమణ చెబుతున్నారు. ఇదే సమయంలో బిర్యానీ అన్నా - ఐస్ క్రీం అన్నా కూడా సింధూకు చాలా ఇష్టమని.. ప్రస్తుతం అవన్నీ సింధూకోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.