Begin typing your search above and press return to search.

తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు

By:  Tupaki Desk   |   20 Oct 2020 11:02 PM IST
తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు
X
తనతో పాటు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై అవసరమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ప్రముఖ షటిల్ ప్లేయర్ పీవీ సింధు తీవ్రంగా హెచ్చరించారు. తన కుటుంబంతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ తో పీవీ సింధూకు పడటం లేదని అందుకనే ఇంగ్లాండ్ వెళ్ళిపోయినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని తెలుసుకున్న సింధు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వదంతులు ఎలా వస్తున్నాయో తనకు తెలీటం లేదంటూ మొత్తుకున్నారు.

తన కుటుంబంతో కానీ కోచ్ గోపీచంద్ తో కానీ తనకు విభేదాలు ఎందుకు వస్తాయని ప్రచారం చేస్తున్న వాళ్లపై మండిపడ్డారు. తన కుటుంబంతో మాట్లాడిన తర్వాతే తాను ఇంగ్లాండ్ కు వచ్చినట్లు ఆమె క్లారిటి ఇచ్చారు. ఏషియాడ్ గేమ్స్ లో అవసరమైన ఫిట్ నెస్ సాధించటం కోసమే కోచ్ గోపీచంద్ తో మాట్లాడి ఇంగ్లాండ్ లోని గేటరోడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇనిస్టిట్యూట్ (జీఎస్ఎస్ఐ)కి వచ్చినట్లు స్పష్టం చేశారు. తాను ఇక్కడ జీఎస్ఎస్ఐ నిపుణురాలు రెబక్కా రాండాల్ పర్యవేక్షణలో అవసరమైన వర్కవుట్స్ చేయటం కోసమే ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ఆ సెంటర్లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను కూడా సింధూ తన ట్విట్టర్ హ్యాండిల్ కు ట్యాగ్ చేశారు.