Begin typing your search above and press return to search.

బరువు తగ్గేందుకు సింపుల్​ చిట్కాలు..!

By:  Tupaki Desk   |   7 March 2021 11:30 PM GMT
బరువు తగ్గేందుకు సింపుల్​ చిట్కాలు..!
X
అరటిపండుతో అనేక ప్రయోజనాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకుంటే మలబద్దకం.. జీర్ణసంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే అరటిపండును తీసుకొని బరువు కూడా తగ్గొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. నిజానికి అరటిపళ్లు ఎక్కువ తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారు. అయితే రోజులో కేవలం 2 అరటిపళ్లు తీసుకుంటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అరటిపండు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాక శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఇతర వ్యర్థాలను కూడా అరటిపండు బయటకు పంపిస్తుంది.

ప్రస్తుతం జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. జంక్​ఫుడ్​ను ఎక్కువగా తీసుకుంటున్నారు. తీవ్రమైన ఒత్తడి పెరిగింది. దానికి తోడు వేళకు నిద్ర ఉండదు. చాలా మంది వ్యాయామం కూడా చేయరు. దీంతో వారి శరీరంలో కొవ్వు పెరుకుపోతుంది. దీనివల్ల అసిడిటి, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్​ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ప్రతిరోజు మన డైట్​లో అరటిపండును చేర్చుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును , మలినాలను తొలగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

అరటి పండ్లలో పొటాషియం అధిక మోతాడులో ఉంటుంది. శరీరంలో అధిక నీరు చేరకుండా ఇది కాపాడుతుంది.

ప్రతిరోజు రెండు ఆరటిపండ్లు తీసుకోవాలని.. జంక్​ ఫుడ్​ స్థానంలో ఉడికించిన కూరగాయల ముక్కలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అంతేకాక అరటిపండులో ఉండే ప్రో-బయోటిక్ గుణాల వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియాలో మన జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు తోడ్పడతాయి.

అరటి పండ్లలో B విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరం లో కొవ్వును పెరగనివ్వదు. సో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ రోజుకు రెండు అరటిపండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. వీటికి తోడు జంక్​ ఫుడ్​ను తగ్గించడం.. వ్యాయామం చేయడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు.