Begin typing your search above and press return to search.
మోడీకి.. సిమి స్పాట్ పెడతామనుకుందా?
By: Tupaki Desk | 11 April 2015 12:36 PM GMTచిన్నచిన్న ఉగ్రవాద కార్యాకలాపాలతో సరిపెట్టే సిమి ఉగ్రవాదులు ఏకంగా భారీ స్కెచ్ గీశారా? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. స్లూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న వివరాలు వింటున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులు షాక్‌కు గురి అవుతున్నారు.
ప్రధానమంత్రి మోడీని హత్య చేసేందుకు సిమి ప్రయత్నించిందని.. కొన్ని అనివార్య కారణాల వల్ల తమ పథకాన్ని అమలు చేయలేకపోయామని గుర్ఫాన్ పోలీసులకు చెప్పారని చెబుతున్నారు.
జార్ఖండ్ పేలుళ్ల తర్వాత రాయ్‌పూర్ నుంచి పరారీ అయిన గుర్ఫాన్.. అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకోవటమే కాదు.. అక్కడ కొన్నాళ్లు కేర్‌టేకర్‌గా పని చేశారు. దుబాయ్‌లో ఉన్నప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది అబూసలేంతో మీటింగ్ అయిన ఆయన.. ప్రధానమంత్రి మోడీకి మట్టుబెట్టాలన్న ప్లాన్‌చేశారు. అంబికాపుర్ లోక్‌సభ ఎన్నికల ్పచార ర్యాలీలో మోడీని హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులకు చెబుతుంటే.. వింటున్న విచారణాధికారుల నోట వెంట మాట రాని పరిస్థితి.
అంతేకాదు.. న్యూఇయర్ సందర్భంగా నేపాల్‌లో ఒక గ్రాండ్ పార్టీ జరిగిందని.. అందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేరస్తులంతా ఆ పార్టీకి హాజరయ్యారని చెబుతున్నారు. విషాదమేమంటే.. ఆ పార్టీకి సంబంధించిన సమాచారం భారతీయ నిఘా వర్గాల దగ్గరే లేదన్న విషాయాన్ని గుర్ఫాన్ వెల్లడించటం గమనార్హం.