Begin typing your search above and press return to search.
దుర్గమ్మ గుడిలో సింహాలు మాయం..వారు అలా చేయడంతో పోలీసులకి పెను సవాల్!
By: Tupaki Desk | 18 Sep 2020 11:11 AM GMTబెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు దొంగతనానికి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు రథం సందర్శన, తీవ్ర వ్యాఖ్యలతో పలు నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటం , విచారణ మొదలెట్టిన సంగతి తెలిసిందే . అయితే వెండి రథం మూడు సింహాల మాయం కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది . కీలక ఆధారాలు సేకరించటం పోలీసులకు కష్టంగా మారింది. తాజాగా అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉండటం, ఇక ఆ విషయాన్ని ఇటీవల ఆలయాలలోని రథాలకు భద్రత కల్పించే సమయంలో గుర్తించటం తెలిసిందే . దీనిపై ఏపీలో పెద్ద రగడ కొనసాగింది.
అంతకు ముందే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావటం , ఆతర్వాత దుర్గ గుడిలో మూడు వెండి సింహాలు మాయం కావటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీల నేతలు అమ్మవారి వెండి రథాన్ని పరిశీలించారు .ఇప్పుడు ఈ పరిణామాలే పోలీసుల విచారణకు ఇబ్బంది తెచ్చి పెట్టాయి. ఉత్సవ సమయంలో మాత్రమే రధాన్ని బయటకు తీస్తామని, మిగతా ఈ సమయంలో రథం ఆలయం లోపలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత 18 నెలలుగా రథాన్ని బయటకి తీయలేదని, ఈ సంవత్సరం కరోనా కారణంగా ఉగాదికి రథోత్సవం జరగలేదని, అయితే రథం లోని మూడు వెండి సింహాలు మాయం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక రాజకీయ పార్టీల నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే రథాన్ని సందర్శించారు. రథంలో వెండి సింహాలు మాయమైన ప్రాంతాల్లో చేతులతో ముట్టుకున్నా రు.
ఇప్పుడు వెండి సింహాలు మాయమైన రథ ప్రదేశంలో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారుతుంది. రథాన్ని సందర్శించి ఆయా భాగాలలో చేతులు వేసిన రాజకీయ పార్టీల నేతల వేలిముద్రలు ఉండడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలామంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది కూడా సాధ్యం కావడంలేదు. మరి కొందరు ఉద్యోగులు ,ఆలయ సెక్యూరిటీని కూడా పోలీసులు విచారించనున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంలో జాప్యం జరగడం , ఫిర్యాదు కంటే ముందే చాలామంది రథం ప్రాంతాన్ని సందర్శించడం తో సంఘటనా స్థలంలో క్లూస్ సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మొత్తంగా ఈ కేసు పోలీసులకి పెను సవాల్ గా మారింది.