Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క రిజ‌ల్ట్‌పై ఏపీ పార్టీల సైలెన్స్.. ఏం జ‌రుగుతోంది...?

By:  Tupaki Desk   |   16 May 2023 5:00 AM GMT
క‌ర్ణాట‌క రిజ‌ల్ట్‌పై ఏపీ పార్టీల సైలెన్స్.. ఏం జ‌రుగుతోంది...?
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏపీలో ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు ఏవీ కూడా పెద‌వి విప్ప‌లేదు. ఎవ‌రూ కూ డా.. నోరు విప్పి.. మాట్లాడింది లేదు. నిజానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను.. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు చాలా స‌మీపం నుంచి గ‌మ‌నించాయి. వైసీపీ నుంచి కొంద‌రు కీల‌క నేత‌లు కూడా.. అక్క‌డ ప్ర‌చారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ర‌ఘువీరా వంటి వారు కూడా అక్క‌డ ప్ర‌చారం చేసి వ‌చ్చారు.

అయితే.. ఫ‌లితం మాత్రం అనూహ్యంగా మారిపోయింది. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓడిపోవాల‌నేది.. కొన్ని పార్టీలు భావించాయి. ఇదే జ‌రిగింది. ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలిస్తే.. ఏపీపై పెత్త‌నం మ‌రింత పెరుగుతుం ద‌ని.. కొన్ని పార్టీలు త‌ల‌పోశాయి. ఇక‌, క‌ర్ణాట‌క‌లోబీజేపీ ఓడిపోయింది. ఇదిలావుంటే, క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలుపుకోసం సాయం చేయాల‌ని.. ఏపీలోని వైసీపీని కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అదే స‌మ‌యంలో డ‌బ్బు కూడా పంపాల‌ని కోరిన‌ట్టు తెలిసింది.

ఈ విష‌యం ఎలా ఉన్నా.. టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన కానీ.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితంపై ఎక్క‌డా స్పందించ‌లేదు. దీనికి ప్ర‌ధానంగా బీజేపీ విష‌యంలో ఎలా స్పందించినా.. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావిస్తుండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. బీజేపీ ఓడిపోయింద‌ని అంటే.. ఆ పార్టీని త‌క్కువ చేసి చూపించిన‌ట్టు అవుతుంద‌ని.. ఇది బీజేపీ పెద్దల‌కు ఆగ్ర‌హం క‌ల్పిస్తుందని పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి.

అయితే.. లోలోన మాత్రం బీజేపీ దూకుడు త‌గ్గడాన్ని త‌మ మంచికే అనుకునేలా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రి స్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. బీజేపీ గెలిచి ఉంటే.. ఏపీలో పుంజుకునేందుకు.. లేదా పెత్త‌నం చేసేందుకు క‌మ‌ల నాథులు ప్ర‌య‌త్నించి ఉండేవారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. సో.. మొత్తంగా చూస్తే.. బీజేపీ ఓట‌మి ఒక‌ర‌కంగా.. ఏపీలో ఉన్న పార్టీల‌కు ఒకింత క‌లిసి వ‌చ్చింద‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి. పైకి ఎవ‌రూ మాట్లాడ‌క‌పోయినా.. ఈ విష‌యంలో ఒక అంచ‌నా కు వ‌చ్చార‌నేది మాత్రం వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.