Begin typing your search above and press return to search.

అమెరికాలో హిస్టరీ క్రియేట్ చేసిన మనోడ్ని దారుణంగా చంపారు

By:  Tupaki Desk   |   28 Sept 2019 1:47 PM IST
అమెరికాలో హిస్టరీ క్రియేట్ చేసిన మనోడ్ని దారుణంగా చంపారు
X
సందీప్ సింగ్ ధాలివాల్ అన్న పేరు చెప్పినంతనే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. అమెరికాలోని హరీశ్ కౌంటీలో ఈ సిక్కు పోలీసు అధికారి గురించి మాత్రం ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన హిస్టరీ క్రియేట్ చేసిన ఇండో అమెరికన్. అమెరికాలో సిక్కు పోలీసు ఆఫీసర్ గా ఆయనకు చక్కటి పేరు ప్రఖ్యాతులున్నాయి.

నలభైఏళ్ల సందీప్ పదేళ్లుగా హరీశ్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీసు ఆఫీసర్ గా పని చేస్తున్నారు.అలాంటి ఆయన నిన్న అర్థరాత్రి వేళ.. స్థానికంగా ట్రాఫిక్ విధులనునిర్వర్తిస్తున్నారు. డ్యూటీలో భాగంగా ఒక కారును ఆపి తనిఖీ చేశారు.

కారులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఒకరు సందీప్ సింగ్ మీద అతి కారాతకంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మిగిలిన పోలీసు సిబ్బంది అలెర్ట్ అయి.. కారులో ఉన్న జంటను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణం గురించి విచారిస్తున్న పోలీసులు.. ఇదంతా పథకం ప్రకారం అతన్ని చంపేందుకు వేసిన ప్రణాళికగా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ తోనే ఇలా చేసి ఉంటారంటున్నారు. ఇదిలా ఉంటే.. సందీప్ సింగ్ కు హిస్టరీ మేకింగ్ ఆఫీసర్ అన్న పేరుంది. ఎందుకంటే.. పోలీసు విభాగంలో తొలి సిక్కు డిప్యూటీ సందీపే. అంతేకాదు.. గడిచిన నాలుగేళ్లుగా గడ్డం.. తలపాగాతో రోడ్లపై అతను విధులు నిర్వర్తిస్తున్నారు.

విపత్తులు చోటుచేసుకున్న వేళ.. బాధితులకు సాయం చేయటానికి తనకుతానుగా ట్రక్కు నడుపుకుంటూ వెళ్లి.. సాయం అందించే గుణం ఆయన సొంతం. అలాంటి వ్యక్తిని దారుణంగా హతమార్చటానికి ప్లాన్ చేసింది ఎవరు? అసలు ఎందుకుచంపాలనుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.