Begin typing your search above and press return to search.
ఫోన్ వాడితే ముసలి లక్షణాలు వస్తాయా?
By: Tupaki Desk | 4 May 2020 11:30 PM GMTప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారా? రాత్రి నిద్రపోతున్నా మొబైల్ ఫోన్ పక్కన ఉండాల్సిందేనా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టేనని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా పరిశోధనలో సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే దుష్పరిణామాలు భయంకరంగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువ సేపు చూడడం వల్ల మెడనొప్పి రావడంతో పాటు నుదురు, మెడ, చెంపలతో పాటు ముఖమంతా ముడతలు వస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అంటే సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారు ముసలివారు త్వరగా అయిపోతారని హెచ్చరిస్తున్నారు.
ఇక ఫోన్ ఎక్కువగా వాడితే అనారోగ్యాల పాలు కావడం కూడా గ్యారెంటీ అంటున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ మీద ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు ముఖం మీదకు చేరి వ్యాధులకు కారణమవుతాయని.. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ కంటే కూడా ఫోన్, ట్యాబ్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ బలంగా చర్మం లోపలికి పోతాయి. దీన్ని హై ఎనర్జీ విజిబుల్ (హెచ్ఈవీ) లైట్ అంటారు. ఈ లైటింగ్ చర్మానికి అవసరమైన కొలాజిన్, ఎలాస్టిన్లను డ్యామేజ్ చేస్తుంది. దాంతో చర్మం ముడతలు పడుతుంది. చర్మం మీద మచ్చలు కూడా పెరుగుతాయి.
ఇక అన్నింటికంటే సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కళ్లు దెబ్బతినడం.. తలనొప్పి నిద్ర పట్టకపోవడం అలసట వస్తాయని పరిశోధకులు తేల్చారు.