Begin typing your search above and press return to search.
గ్రహాంతర వాసుల నుంచి చైనాకు సిగ్నల్స్
By: Tupaki Desk | 16 Jun 2022 2:30 AM GMTప్రపంచలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ చైనాలో ఉన్న 'స్కైఐ' కు గ్రహాంతర వాసుల నుంచి సిగ్నల్స్ అందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటితో పోలిస్తే ఇవి భిన్నంగా ఉన్నాయని గ్రహాంతర వాసుల అన్వేషణ పై అధ్యయనం చేస్తున్న బృందం చీఫ్ సైంటిస్ట్ జాంగ్ టోన్జీ తెలిపారు. ఇవి గ్రహాంతర వాసుల నుంచి అందినట్లున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు.
భూగ్రహం బయటి నుంచి చైనా టెలిస్కోప్‌కు అందిన సంకేతాలు గ్రహాంతరవాసులు పంపించినవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ దేశానికి చెందిన భారీ టెలిస్కోప్ 'స్కై ఐ' ఇటీవల తక్కువ స్థాయి-బ్యాండ్ ఎలక్ట్రోమేగ్నెటిక్ సిగ్నల్స్‌ను గుర్తించిందని చైనా వెల్లడించింది. ఈ సంకేతాలు గ్రహాంతరవాసుల నుంచే వచ్చివుండొచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అధికారి చెప్పినట్లు స్థానిక న్యూస్ వెబ్సైట్ రాసింది. కానీ న్యూస్ ప్రచురించిన కొన్ని గంటల్లోనే రిపోర్ట్ను, పోస్టును డిలీట్ చేసింది.
న్యూస్ వెబ్సైట్ ఈ రిపోర్టును ఎందుకు డిలీట్ చేసిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ.. సదరు వెబ్సైట్ ఆ న్యూస్, రిపోర్టును డిలీట్ చేసేలోగా.. చైనా మైక్రో బ్లాగింగ్ నెట్వర్క్ విబోలో ఈ రిపోర్ట్ వైరల్గా మారింది. అనంతరం ఇతర మీడియాకూ ఈ న్యూస్ వ్యాపించింది. ఇంతకీ ఆ రిపోర్టులో ఏం ఉందంటే..?
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ 'స్కై ఐ'కి అందిన సిగ్నల్స్ గ్రహాంతర వాసులవే కావొచ్చని, ఇప్పటి వరకు గుర్తించిన వాటితో పోలిస్తే ఇవి భిన్నంగా ఉన్నాయని గ్రహాంతర వాసుల అన్వేషణపై అధ్యయనం చేస్తున్న బృందం చీఫ్ సైంటిస్ట్ జాంగ్ టోన్జీ తెలిపారు. ఈ సిగ్నల్స్‌పై తమ శాస్త్రవేత్తల బృందం లోతైన అధ్యయనం కొనసాగిస్తుందని తెలిపారు. టెలీస్కోప్ గుర్తించిన అనుమానిత సిగ్నల్స్.. ఒక రకమైన రేడియో ఇంటర్ఫియరెన్స్ (రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాల కలయిక) అయి ఉండొచ్చని అభిప్రాయాలున్నాయి.
ఈ సిగ్నల్స్‌పై తదుపరి పరిశోధన చేయాల్సి ఉందని జాంగ్ వివరించారు. బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, నేషనల్ అస్ట్రోనామికల్ అబ్సర్వేటరీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కీల ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అధ్యయన బృందానికి జాంగ్ టోన్‌జీ నేతృత్వం వహిస్తున్నారు.
నైరుతి చైనాలోని గిజువూ ప్రావిన్స్లో 'స్కై ఐ' టెలిస్కోప్ ఉంది. దీని వ్యాసం 500 మీటర్లు(1640 అడుగులు)గా ఉంది. గ్రహాంతర వాసుల ఉనికిపై అధ్యయనం కోసం సెప్టెంబర్ 2020లో అధికారికంగా ప్రారంభించారు. ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తల బృందం 2020లో రెండు జతల ఏలియన్ అనుమానాస్పద సిగ్నల్స్‌ను గుర్తించింది. ఆ తర్వాత 2022లో కూడా సిగ్నల్స్ అందాయని జాంగ్ తెలిపినట్టు నివేదిక పేర్కొంది.
గ్రహాంతర వాసుల ఉనికి పై ఇప్పటి దాకా నాసాతో పాటు ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. వివిధ స్టేషన్ల నుంచి అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ పంపుతున్నారు. వాటికి సమాధానం వచ్చిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. నెదర్లాండ్ లోని రేడియో టెలిస్కోప్ ఫ్రీక్వెన్సీ నుంచి ఓ నక్షత్ర వ్యవస్థ నుంచి లభించిన సమాచారం ఆధారంగా వీటిని కనుగొన్నారని బ్రిటిష్ వార్తా పత్రిక 'ది గార్డియన్'ద్వారా వెల్లడించింది.