Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ రాజకీయాలతో సిద్ధూ రాజీ పడ్డారా!

By:  Tupaki Desk   |   24 Dec 2016 10:00 AM GMT
కాంగ్రెస్ రాజకీయాలతో సిద్ధూ రాజీ పడ్డారా!
X
100సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ సముద్రం అని అందులోకి చాలా రకాల నదులు - కాలువలు వచ్చి కలుస్తూ, పోతూ ఉంటాయని చెబుతుంటారు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. చాలా సందర్భాల్లో ఈ విషయం నిజం అనిపించకమానదు. దీనికి గతంలో ప్రజారాజ్యం పార్టీని తమలో కలుపుకుని చిరంజీవిని రాజ్యసభ సభ్యుడిగా మిగల్చడాన్ని ఒక తాజా ఉదాహరణగా చూపించొచ్చు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... తాజాగా కాంగ్రెస్ రాజకీయాలతో రాజీ పడినట్లున్నారు సిద్దూ!

పంజాబ్ లో తనమార్కు రాజకీయాలు చూపించాలనో, వ్యక్తిగా సూపర్ పవర్ గా నిలవాలనో కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తన ఎంపీ పదవికి రాజినామా చేశారు. అయితే బీజేపీలో సిద్ధూ ఎంపీగా ఉండగా ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకువచ్చారో ఆ సమయంలో తన ఎంపీ పదవికీ రాజినామా చేశారు. అయితే తదనంతర పరిణామాల్లో ఆప్ లో చేరతారని ప్రచారం జరిగినా... సిద్ధూ కోరినట్లుగా ఆయనకు - ఆయన భార్యకు కూడా ఎంపీ - ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ఆప్ అంగీకరించలేదు! అనంతరం సిద్ధూకి ఉన్న ఆప్షన్ కాంగ్రెస్!

ఈ సమయంలో తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరిన సిద్ధూ... అక్కడ కూడా రెండు సీట్ల ప్రస్థావన తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ఎలా సమర్ధించిందో లేక వారి రాజకీయ చాణక్యం ముందు సిద్ధూ యే రాజీపడాల్సి వచ్చిందో కానీ... ఫైనల్ గా సిద్ధూ రాజీపడ్డారు. ఫలితంగా తన భార్య సంగతి కాసేపు పక్కనపెట్టి అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి తానుమాత్రమే పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు.. ఈ విషయాన్ని ఆయన భార్య వెల్లడించారు. ఏది ఏమైనా... కాంగ్రెస్ రాజకీయాలకో, తాను ఇప్పుడున్న పరిస్థితికో కానీ సిద్దూ రాజీ పడ్డారనే అనుకోవాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/