Begin typing your search above and press return to search.

అన్నా చెల్లెళ్ల‌ను సిద్ధూ ఫుల్లుగా ముంచేశాడే!

By:  Tupaki Desk   |   29 Sep 2021 1:30 PM GMT
అన్నా చెల్లెళ్ల‌ను సిద్ధూ ఫుల్లుగా ముంచేశాడే!
X
రాజ‌కీయాల్లో ఎక్క‌డా `న‌మ్మ‌కం` అనేది లేద‌ని.. న‌మ్మితే.. క‌ష్ట‌మేనని మ‌రోసారి నిరూపించారు.. స్టార్ క్రికెటర్‌, క‌మ్ పొలిటీషియ‌న్ న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ! పంజాబ్ రాజ‌కీయాల్లో త‌నకంటూ.. ప్ర‌త్యేక స్థానం కైవ‌సం చేసుకున్న సిద్ధూ.. ఆది నుంచి కూడా త‌న వైఖ‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో రాజ‌కీయా లు చేశారు. ఎక్క‌డా వేరేవారి ప్ర‌మేయాన్ని ఆయ‌న త‌ట్టుకునేవారు కాదు. మ‌రీ ముఖ్యంగా సీనియ‌ర్లు ఏం చెప్పినా.. పాత చింత‌కాయ్‌! అనే టైపు రాజ‌కీయాలు చేశారు. అయితే.. యువ‌కుడు, యువ‌త‌లో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడు కావ‌డం.. ఆయ‌న‌కు ప్లస్‌ అయింది.

ఇది.. ఆయ‌న‌కు మేలు చేసిందే త‌ప్ప‌.. ఆయ‌న‌ను న‌మ్ముకున్న పార్టీకి మాత్రం మేలు చేయ‌లేక పోయిం ది. పైగా.. అడ్డ‌గోలుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా పార్టీకి న‌ష్టం క‌లిగించింది. ఆది నుంచి సిద్ధూకు ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుడు.. రాహుల్‌గాంధీ. అస‌లు అప్పాయింట్ మెంటే అవ‌స‌రం లేనివిధంగా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఆయ‌న బాట‌లోనే ఆయ‌న సోద‌రి.. ప్రియాంక గాంధీ కూడా న‌డిచారు. యువ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కావ‌డంతో బీజేపీకి చెక్ పెడ‌తాడ‌ని.. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తాడ‌ని అనుకున్నారు.

అయితే.. ఈ న‌మ్మ‌క‌మే.. వారి కొంప ముంచింది. త‌న వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. రాహుల్‌, ప్రియాంక‌ల‌కు భారీ షాక్ ఇచ్చారు సిద్ధూ! ఇటీవ‌ల పంజాబ్ రాజ‌కీయ ప‌రిణామాలు తీవ్ర‌స్థాయిలో వివాదానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. సిద్దూకు, ఇటీవ‌ల రాజీనామా చేసిన అమ‌రీంద‌ర్‌కు మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదంతో అమ‌రీంద‌ర్‌ను రాజీనామా చేయించారు. అయితే.. ఆది నుంచి కూడా సిద్ధూ వ్య‌వ‌హారంపై అనుమానంతో ఉన్న సోనియా.. సీనియ‌ర్ అయిన‌.. అమరీంద‌ర్ వైపే ఉన్నారు.కానీ, రాహుల్, ప్రియాంక‌లు మాత్రం.. త‌మ ప‌ట్టు నెగ్గించుకున్నారు.

సిద్దూ `కోరిక‌` మేర‌కు అమ‌రీంద‌ర్‌తో స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసే ప‌రిస్థితి తీసుకువ‌చ్చారు. ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు ఈ సీఎం స్థానం.. సీసీ అధ్య‌క్షుడిగా ఉన్న త‌న‌కే ద‌క్కుతుంద‌ని.. సిద్ధూ అనుకున్నాడు. వాస్త‌వానికి ఈ పీసీసీ సీటు కూడా రాహుల్ ముచ్చ‌ప‌డి ఇచ్చుకున్న‌దే. ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. వారిని కాద‌ని.. రాహుల్ సిద్ధూకు ఈ ప‌ద‌వి ఇచ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌కుండా.. త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడాడ‌నే వాద‌న ఉంది.

స‌రే! ఇదిలావుంటే.. సిద్ధూ కోసమని ఇంత చేసిన రాహుల్, ప్రియాంకలకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండానే పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధు రాజీనామా చేసేశారు. దీంతో రాహుల్‌, ప్రియాంక‌ల‌కు నోట మాట లేకుండా పోయింది. పార్టీకి, నాయకత్వానికి ఎంతో కమిటెడ్ గా ఉన్న ప్ర‌జానేత అమరీందర్‌ను సైతం ప‌క్క‌న పెట్టి సిద్దూ కు వాల్యూ ఇస్తే.. ఇప్పుడు.. ఆయ‌న క‌నీసం.. ఒక్క‌మాట కూడా చెప్ప‌కుండానే పార్టీ ప‌దవికి రిజైన్ చేయ‌డం ఈ అన్నాచెల్లెళ్ల‌కు త‌ల‌కొట్టేసిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం సిద్దూ రిజైన్‌కు రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు.. భావిస్తున్నారు. ఒక‌టి.. ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఇవ్వ‌క‌పోవ‌డం.. రెండు.. త‌న‌కు చెందిన వారిని కేబినెట్‌లోకి తీసుకోక‌పోవ‌డం.. ఈ రెండు జ‌ర‌గ‌నందుకే,.. ఆయ‌న క‌నీసం రాహుల్‌కు కూడా చెప్ప‌కుండానే పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశార‌నే గుస‌గుస వినిపిస్తోంది. అయితే.. తాను ప‌ద‌వికి మాత్ర‌మే రాజీనామా చేశాన‌ని.. కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని అంటున్నారు.. సిద్ధూ త్వ‌ర‌లోనే ఆప్‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.