Begin typing your search above and press return to search.
అవినాష్ ముఖ్యమంత్రి సంరక్షణలో ఉన్నారు... జగన్ మీద డైరెక్ట్ గా...?
By: Tupaki Desk | 21 April 2023 3:00 PM GMTవైఎస్ వివేకాందరెడ్డి దారుణ హత్య కేసు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆరుగురిని అరెస్ట్ చేసింది. ఇందులో చివరి ముగ్గురూ వైసీపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు కలిగిన వారు కావడంతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఇటీవల అరెస్ట్ అయిన వైఎస్ భాస్కరరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహిత బంధువు కావడంతో ఈ కేసు ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది.
ఇపుడు చూస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో కాస్తా ఊరట పొంది అరెస్ట్ ని తప్పించుకున్నారు. ఈ నెల 25 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయన రోజు వారీ విచారణకు సీబీఐ ముందు హాజరవుతున్నారు.
ఇదిలా ఉండగా అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని వివేకా కుమార్తె పంతం పట్టి ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ విషయంలో ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ కేసుని ఈ నెల 30కి ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశలు ఉంటే ముందస్తు బెయిల్ మీద మధ్యంతర ఉత్తర్వులను అవినాష్ రెడ్డికి తెలంగాణా హై కోర్టు ఇవ్వడం పట్ల సునీత సుప్రీం కోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సిన వ్యక్తిని ఇలా చేయడం మీద ఆమె సుప్రీం కోర్టులో న్యాయం కోరుతున్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో సునీత తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ సిద్ధాధ్ర లూద్రా ఈ కేసు చాలా ప్రాధాన్యత కలిగినది అని పేర్కొన్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ కేసు అతి ముఖ్యంగా చూడాలని కోర్టుకు నివేదించారు.
ఈ నేపధ్యంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి రక్షణలో ఉన్నారని చెప్పడం విశేషం. అంటే ఆయన్ని సీఎం కాపాడుతున్నారు అన్న భావన వచ్చేలా లాయర్ కోర్టు దృష్టిలో పెట్టారన్న మాట. మొదట అవినాష్ రెడ్డి తనపై సీబీఐ పెట్టిన కేసుని కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని దాన్ని కోర్టు కొట్టేయడంతో ఇపుడు ఆయన ముందస్తు బెయిల్ కోరుతున్నారని కూడా లాయర్ పేర్కొన్నారు
ఈ కేసులో ఏ ఫోర్ అయిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పెద్దల జోక్యం ఉందని భావించి సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇపుడు ముందస్తు బెయిల్ ఇవ్వడం అంటే ఈ కేసు విచారణకు అది ఇబ్బందిగా అవరోధంగా మారుతుందని కూడా లాయర్ సుప్రీం కోర్టుకు విన్నవించారు.
ఇదిలా ఉండగా ఈ నెల 25న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తుది తీర్పుని హై కోర్టు ఇస్తుంది కదా అపుడు దాన్ని చూసి సుప్రీం కోర్టులో సవాల్ చేసుకోవచ్చు కదా కోర్టు పేర్కొంది. పైగా ఇవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే కదా అని అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో విస్తృత కుట్ర కోణంలో సీబీఐ దర్యాప్తు జరుపుతోదని, ఇపుడు ముందస్తు బెయిల్ ఇస్తే కనుక మొత్తం దర్యాప్తు దారి తప్పే అవకాశం ఉందని అందుకే విధి లేకనే తాము సుప్రీం కోర్టు తలుపులు తట్టినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో ఈ పిటిషన్ ని తీసుకున్న సుప్రీం కోర్టు ఏ రకంగా తీర్పు ఇస్తుంది అన్నది ఉత్కంఠంగా మారింది. ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రక్షణలో అవినాష్ అంటూ సునీత తరఫున లాయర్ చేసినట్లుగా చెబుతున్న కామెంట్స్ మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి.