Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్లతో నపుంసకత్వం నిజమేనా?

By:  Tupaki Desk   |   4 Jan 2021 1:30 AM GMT
కరోనా వ్యాక్సిన్లతో నపుంసకత్వం నిజమేనా?
X
దేశంలోకి రెండు వ్యాక్సిన్లను ఈరోజే కేంద్రం అనుమతిచ్చింది. ఆక్స్ ఫర్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కరోనా వ్యాక్సిన్లు ఎంత మేరకు ప్రభావం చూపుతాయనే విషయంపై తాజాగా డీసీజీఐ వీజీ సొమానీ ఆదివారం వెల్లడించారు.

వ్యాక్సిన్లు వందశాతం ప్రభావాన్ని చూపుతాయని తాము నిర్ణయానికి వచ్చిన తరువాతే అనుమతి ఇచ్చినట్లు డీసీజీఐ వీజీ సొమానీ తెలిపారు. వందశాతం సేఫ్ గా పనిచేస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యాక్సిన్ తీసుకున్నా స్వల్పంగా జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్టులు వస్తాయని పేర్కొన్నారు.

ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకులుగా మారుతారనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని సామానీ కొట్టిపారేశారు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది తప్పుడు ప్రచారం అని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంతో కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా దూరంగా ఉండవద్దని కోరారు.

తాము కోట్లాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చామని సామానీ స్పష్టం చేశారు. తాము తొందరపడి నిర్ణయాలను తీసుకోలేదని చెప్పారు. ఈ వ్యాక్సిన్లు 110శాతం ప్రభావం చూపుతాయని సామాని భరోసా ఇచ్చారు.