Begin typing your search above and press return to search.

కాలిఫోర్నియాలో దొరికిన సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుడు

By:  Tupaki Desk   |   2 Dec 2022 11:39 AM GMT
కాలిఫోర్నియాలో దొరికిన సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుడు
X
మే నెలలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రధాన సూత్రధారి అయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు, గోల్డీ బ్రార్ ఇటీవల కెనడా నుంచి అమెరికాకి వెళ్లారు. అక్కడ అతను 2017 నుండి రహస్యంగా తలదాచుకుంటున్నట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ను నవంబర్ 20న కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా నుండి భారత ప్రభుత్వానికి ఇంకా అధికారిక ప్రకటన రాలేదని వర్గాలు తెలిపాయి.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో మూస్ వాలా హత్యకు సూత్రధారి తానేని గోల్డీ బ్రార్ తెలిపాడు. అనంతరం కెనడాకు వెళ్లి అక్కడే కొద్దిరోజులు ఉన్నాడు. భారత ప్రభుత్వ ఒత్తిడితో అమెరికాకు మకాం మార్చాడు. అతను ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నాడు. శాక్రమెంటో, ఫ్రిజో మరియు సాల్ట్ లేక్ వంటి నగరాలను అతని సురక్షిత ప్రదేశాలకు భావించి అక్కడే తిరుగుతున్నాడు.

భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW), ఢిల్లీ పోలీసుల నిఘా విభాగం మరియు పంజాబ్‌లోని వారి సహచరులకు గోల్డీ బ్రార్ అరెస్ట్ కాలిఫోర్నియాలో పెద్ద సంచలనం కలిగించిందని సమాచారం.

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం తన పార్టీ ఆప్ తరపున ప్రచారం చేస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విలేకరుల సమావేశంలో ఈ వార్తలను ధృవీకరించారు. "ఈ రోజు ఉదయం ధృవీకరించబడిన వార్త ఉంది. కెనడాలో దాక్కున్న పెద్ద గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు" అని సీఎం మాన్ తెలిపారు.

ఇటీవల సిద్ధూ మూస్ వాలా తండ్రి గోల్డీ బ్రార్‌పై ఎలాంటి సమాచారం ఇచ్చినా ₹2 కోట్ల రివార్డును ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధిక మొత్తాన్ని ఇవ్వలేకపోతే తన జేబులో నుండి పారితోషికం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన గోల్డీ బ్రార్ 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. గత నెలలో జరిగిన డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో కీలక సూత్రధారి ఇతడే అని పోలీసులు తెలిపారు. సిద్ధూ మూస్ వాలాగా ప్రసిద్ధి చెందిన 28 ఏళ్ల శుభదీప్ సింగ్ సిద్ధూ మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని అతని గ్రామానికి సమీపంలో తన ఎస్.యూవీలో కాల్చి చంపబడ్డాడు. పంజాబ్ ప్రభుత్వం అతని భద్రతను తగ్గించిన ఒక రోజు తర్వాత ఈ హత్య జరిగింది.

గత ఏడాది జరిగిన యువ అకాలీ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్యకు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడినట్లు గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం తిరుగుతూనే ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.