Begin typing your search above and press return to search.
ఆయనకు పవన్ తత్వం బోధపడింది!
By: Tupaki Desk | 12 Sept 2016 4:00 AM ISTతిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించి ఒక విడత చెడామడా తిట్టిపోస్తే.. సదరు కేంద్రమంత్రి గారికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఒకవైపు పవన్ తిట్టిన తిట్లకు వెంకయ్యనాయుడు లాంటి వాళ్లంతా ఉడికిపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు ఇన్చార్జి అయిన సిద్ధార్థ నాధ్ సింగ్ మాత్రం భిన్నంగా స్పందించారు.
అబ్బే పవన్ కల్యాణ్ తిరుపతిలో మమ్మల్నేమీ తిట్టలేదే అని ఆయన వ్యాఖ్యానించారు. భాజపా మీద విమర్శలు చేయలేదే.. అని మెరమెచ్చు మాటలు పలికారు.
తీరా కాకినాడ సభ కూడా పూర్తయ్యేసరికి.. పవన్ కల్యాణ్ తిడుతున్న తిట్లు ఏదో కాకతాళీయంగా బయటకు వస్తున్నవి కాదని.. కాకపుట్టించేవి అని ఆయనకు అర్థమైనట్లుగా ఉంది. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. ఇప్పుడాయన ఏకంగా పవన్ కల్యాణ్ కు సవాలు విసురుతున్నారు. ప్యాకేజీ గురించి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆయన పవన్ కల్యాణ్ నే తొడకొట్టి పిలుస్తున్నాడు. అంటే సదరు భాజపా ఇన్చార్జిగారు.. ఈ ఎండ్‌లో ప్యాకేజీ గొప్పదనాన్ని వివరిస్తే.. అవతల పవన్ కల్యాణ్ అందులో లోపాలను చెప్పి, అంతకంటె ప్రత్యేకహోదా గొప్పదనాన్ని కూడా చెప్పాలన్నమాట.
తిరుపతిలో తిట్లను తేలిగ్గా తీసుకున్న అదే నాయకుడు, కాకినాడ మీటింగు పూర్తయ్యేసరికి తీవ్రంగా తీసుకున్నారని, ఆయనకు పవన్ తత్వం అంటే ఏమిటో ఇప్పటికి బోధపడిందని జనం అనుకుంటున్నారు.