Begin typing your search above and press return to search.
బీజేపీకి సిద్ధూ స్వీట్ షాక్!
By: Tupaki Desk | 6 July 2023 11:53 AM GMTకర్ణాటక అసెంబ్లీకి మే నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీకి 113 స్థానాలు రావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 135 స్థానాలు సాధించింది. దీంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాగా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. 40 శాతం కమీషన్లు తీసుకుంటూ బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఫోన్ పే లోగో తరహాలో 'ఫోన్ పే సీఎం' అంటూ పోస్టర్లు విడుదల చేసి కలకలం రేపారు. ఈ ఫోన్ పే సీఎం పోస్టర్లపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. కర్ణాటకలో బీజేపీ నేతలు ప్రతి పనికి 40 శాతం కమీషన్ తీసుకోందే పనులు జరగనివ్వడం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పలువురు కాంట్రాక్టర్లు సైతం బీజేపీ నేతలు కమీషన్ల కోసం వేధిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీ అవినీతి పాలనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణ సంఘాలను ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ నేతలకు స్వీట్ షాక్ ఇస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు లాగి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడంతోపాటు తమ ఆరోపణలు సిల్లీగా చేసినవి కాదని నిరూపించుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన బిట్‌కాయి తో సహా పలు స్కాములపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 40 శాతం కమీషన్ల అవినీతి కేసులను న్యాయ విచారణకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తమ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను కూడా విచారణ సంస్థలకు/సంఘానికి ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
న్యాయ విచారణ ద్వారా కర్ణాటకలోని బీజేపీ అవినీతి బయటపడుతుందని, ఎవ్వరిని వదిలిపెట్టబోమని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ మేరకు త్వరలో బీజేపీ అవినీతి నాయకుల కోసం కొత్తగా జైలును నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. లేదంటే బీజేపీ కార్యాలయానికే కమ్మీలు పెట్టాలని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గంగా కళ్యాణ్ బోర్ వెల్ కేసు, ఎస్‌ఐ నియామక కుంభకోణం, బిట్‌కాయిన్ స్కామ్, చామరాజనగర్ లో ఆక్సిజన్ కొరతతో భారీ ఎత్తున రోగులు మరణించిన వ్యవహారం సహా పలు అవినీతి కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. అలాగే 40 శాతం కమీషన్ల వ్యవహారంపైనా న్యాయ విచారణకు దిగుతోంది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.వీరప్ప ఆధ్వర్యంలో విచారణ కమిటీని వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కర్ణాటక రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.