Begin typing your search above and press return to search.
తెలంగాణలో పోలీసులకూ రక్షణ లేదు
By: Tupaki Desk | 18 Sep 2015 9:53 AM GMTరంగారెడ్డి జిల్లా యాలాల సబ్ ఇన్ స్పెక్టర్ రమేశ్ ది హత్యేనా? ఆయన హత్యలో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉందా? ఇసుక మాఫియా - మంత్రి మహేందర్ రెడ్డి - అధికార పార్టీ నాయకులు కలిసి రమేశ్ హత్య చేయించారా? వారికి ఇద్దరు పోలీసు ఇన్ స్పెక్టర్లు సహకరించారా? కేవలం ఇది ఇసుక మాఫియా కారణంగా చేసిన హత్యనా లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా? రమేశ్ ను అసలు ఎందుకు చంపారు? అసలు కుట్ర ఏమిటి? రమేశ్ హత్య వెనక ఎవరు ఉన్నారు? ప్రస్తుతతం వెల్లువెత్తుతున్న ప్రశ్నలు ఇవి.
మంగళవారం సాయంత్రం నాలుగు నెలల గర్భవతి అయిన తన భార్యను తీసుకుని రమేశ్ తాండూరు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి లక్ష్మణ్ నాయక్ అనే అధికార పార్టీ నేత పదే పదే ఫోన్లు చేశాడు. అయినా రమేశ్ ఆ ఫోన్ ఎత్తేలేదు. అతనితో మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికే అర్బన్ సీఐ వెంకట్రామయ్య ఫోన్ చేశాడు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు చూడడానికి నదికి వెళ్లాలని ఆదేశించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి రూరల్ సీఐ ఫోన్ చేశారు. ఆయన కూడా అదే చెప్పారు. దాంతో, భార్యను ఇంటికి వెళ్లిపోవాలని చెప్పి ఆయన అక్కడి నుంచే నదికి వెళ్లారు. కానీ, ఆయన తిరిగి రాలేదు. అప్పటి వరకు చక్కగా ఉన్న రమేశ్ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.
రమేశ్ పోస్టుమార్టంలో ఆశ్చర్యం గొలిపే విషయాలు తెలిశాయి. ఆయన ఒంటి మీద కర్రలతో కొట్టిన గుర్తులు ఉన్నాయి. తొడలు - మోకాళ్లు - కీళ్ల వద్ద రక్తం కమిలిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తాస్రావం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, పోలీసులను పోలీసు దెబ్బలు కొట్టారని పో్స్టుమార్టం నివేదికలో తెలిపారని సమాచారం. కుడికాలు మడమ, చేతుల వేళ్లకు గాయాలు ఉన్నాయి. దాంతో రమేశ్ ది ఆత్మహత్య కాదని, ఇది హత్య అని నిర్థారిస్తున్నారు. మరోవైపు, రమేశ్ హత్య వెనక మంత్రి మహేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా మొత్తం మంత్రి మహేందర్ రెడ్డి గుప్పిట్లో ఉందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలోనూ అనేక వివాదాలు వచ్చాయి. తాజాగా మంత్రి మహేందర్ రెడ్డి - లక్ష్మణ్ నాయక్ - ఇద్దరు ఇన్ స్పక్టర్లు - ఇసుక మాఫియా కలిసి రమేశ్ ను హత్య చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కానీ, మంత్రి - పోలీసుల ప్రమేయం నేపథ్యంలో సీబీఐ విచారణకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ తీవ్ర వివాదం కానుంది.