Begin typing your search above and press return to search.
ఈ ఎస్ఐ చేసిన సాహసం గురించి తెలిస్తే అభినందించకుండా ఉండలేరు
By: Tupaki Desk | 22 March 2023 1:00 PM GMTరీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ సాహసాన్ని చేశాడు బంజారాహిల్స్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కరుణాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. అతడు చేసిన సాహసం గురించి తెలిసిన తర్వాత అతన్ని అభినందించకుండా ఉండలేం. అతడి సాహసం కారణంగా 16 మందికి ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. వావ్ అనిపించేలా చేసిన సాహసం గురించి తెలుసుకోవాల్సిందే.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఎస్ ఐగా పని చేస్తున్న కరుణాకర్ రెడ్డి. పేపర్ లీకేజీ ఉదంతంపై నిరసన వ్యక్తం చేసేందుకు ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్నిచేపట్టారు ఏబీవీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని పోలీసు వాహనంలో తరలించేందుకు వాహనంలో ఎక్కించారు. వారికి కాపలాగా బంజారాహిల్స్ కు చెందిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి.. ఇతర సిబ్బంది సైతం వాహనంలో కూర్చున్నారు.
సదరు వాహనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగి నెక్లెస్ రోడ్డు వైపు వెళుతున్న వేళలో.. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ రమేశ్ కు ఫిట్స్ రావటంతో వాహనం కంట్రోల్ తప్పింది. దీంతో అటు ఇటూ తిరుగుతున్న వాహనాన్ని గమనించిన ఎస్ఐ ఆ వెంటనే వాహనంలో నుంచి కిందకు దూకేశారు. అదే వేగంతో వ్యాను ముందుకు పరుగులు తీశాడు. డ్రైవర్ డోర్ తీసి.. స్టీరింగ్ పట్టుకోవటంతో పాటు.. బ్రేక్ వేయటంతో ఒక్క కుదుపులో పూలకుండీని ఢీ కొట్టి.. పక్కనే ఉన్న గ్రిల్ ను గుద్దుకొని వాహనం ఆగిపోయింది.
ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. అనూహ్యంగా ఎదురైన పరిణామాన్ని అంతే వేగంగా స్పందించిన ఎస్ఐ కారణంగా 16 మంది ఎబీవీపీ కార్యకర్తలను.. పోలీసు సిబ్బందిని తన సాహసంగా కాపాడారని చెప్పాలి. ఒకవేళ.. ఆయన సమయస్ఫూర్తిగా స్పందించకుంటే.. ఫ్లైఓవర్ ఎడమవైపునకు వ్యాన్ వెళ్లి ఉంటే.. కిందకు పడిపోయేది. తీవ్ర ప్రమాదానికి గురయ్యేది. ఒకవేళ.. కుడి వైపునకు వెళ్లి ఉంటే.. వాహనాల్ని ఢీ కొట్టి మరో పెద్ద ప్రమాదానికి గురయ్యేది.
ఇలా చూసినప్పుడు.. ఎలా అయినా ప్రమాదానికి వంద శాతం అవకాశం ఉన్న పరిస్థితిని అధిగమించి..ఎవరికి ఏమీ కాకుండా వ్యవహరించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సాహసానికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే సైఫాబాద్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
అరెస్టు చేసిన వారిని వేరే వాహనంలోకి తరలించటం.. హోంగార్డుకు చికిత్స చేశారు. ఈ ఉదతంలో ఎస్ఐ కరుణాకర్ రెడ్డికి.. హోంగార్డుకు కొద్దిపాటి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఇప్పుడు చెప్పండి ఎస్ఐ కరుణాకర్ రెడ్డిని అభినందించాలని అనిపించట్లేదు?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.