Begin typing your search above and press return to search.

రూ.కోటి: ఒవైసీ నాలుక రేటు పెరిగింది !

By:  Tupaki Desk   |   17 March 2016 9:56 AM GMT
రూ.కోటి: ఒవైసీ నాలుక రేటు పెరిగింది !
X
భారత్ మాతాకీ జై అని ఎందుకు అనాలి అంటున్న మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివసనేన ఆయనపై మండిపడింది. అసదుద్దీన్ ఒవైసీ తన భారత పౌరసత్వాన్ని ఉపసంహరించాలని శివసేన తాజాగా డిమాండ్ చేసింది. భారత మాతను కీర్తించడం ఇష్టం లేని వారికి ఈ దేశ పౌరులుగా కొనసాగే అర్హత లేదని శివసేన పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన భాజపా నేత శ్యామ్‌ ప్రకాశ్‌ ద్వివేది ఒవైసీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆయన నాలుక కోసి తెచ్చిన వారికి రూ.కోటి రివార్డుగా ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాక ఒవైసీ ఓ ఉగ్రవాదని, ఆయనకు ఈ దేశంలో నివసించే హక్కు లేదని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం నేత ఒకరు ఒవైసీ నాలుక కోసిన తెచ్చిన వారికి 21 వేల రివార్డును ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి కూడా ఒవైసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసద్ ఓ పాకిస్థానీ అని... అందుకే ఆయన భారత మాతకు జైకొట్టడానికి ఇష్టపడడం లేదని అన్నారు. తిరుపతిలో ఈ రోజు మాట్లాడిన స్వామీ పరిపూర్ణానంద... ఒవైసీ విషయంలో హిందువులు సహనంతో ఉండాలని సూచించారు.

ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు అసద్ పై విమర్శల వర్షంకురిపించారు. మఃహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు అసద్ ను అనుసరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒవైసీ నిర్వహించతలపెట్టిన సభకు అక్కడి అదికారులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. లక్నోలో ఒవైసీ 30 మందికి మించి అనుచరులతో కనిపించరాదని... సభలు సమావేశాలు నిర్వహించరాదని ఆదేశిస్తూ 30 పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది. దీంతో లక్నో - ఆజంఘర్ లలో పర్యటించాల్సిన ఒవైసీ ప్రోగ్రాం రద్దయింది.