Begin typing your search above and press return to search.
ఫోర్బ్స్ మెచ్చిన శుభ్ మన్ గిల్ .. అరంగ్రేటమే అదుర్స్ !
By: Tupaki Desk | 4 Feb 2021 5:30 PM GMTఆస్ట్రేలియాతో సిరీస్ లో అదరగొట్టిన భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ఫోర్బ్స్ ఇండియా 30 అండర్-30 జాబితాలో చోటు దక్కింది. ప్రతి ఏడాది దేశంలోని యువ ప్రతిభావంతులతో ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో గిల్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకున్న భారత్ చరిత్ర సృష్టించింది. ఆ విజయంలో గిల్ పాత్ర చాలా కీలకమైంది. వికెట్ సమర్పించకుండా పదునైన పేస్ బంతులని ఎదుర్కొంటు విజయం లో తన వంతు పాత్ర పోషించాడు.
మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా శుభ్‌మన్ గిల్ ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడుతూ... 'డే/నైట్ టెస్టులో టీమిండియా 36కు ఆలౌటైనప్పుడు అందరం ఒక్కసారిగా షాకయ్యాం. అత్యంత వేగంగా కుప్పకూలడంతో ఎలా స్పందించాలో తెలియలేదు. ఆ టెస్ట్ ఓటమి నుంచి బయటపడేందుకు మాకు ఏమాత్రం సమయం దొరకలేదు. మ్యాచులో మంచి స్థితిలో ఉండగా.. ఒకే ఒక్క గంటలో అంతా మారిపోయింది. ఒక్కసారిగా వికెట్ల పతనం మొదలైంది. మీడియాలో ది గ్రేట్ అడిలైడ్ కొలాప్స్ అనే వాక్యాలు చదివినప్పుడు ఎంతో బాధేసింది. ఈ సిరీసును గుర్తుపెట్టుకోవద్దని అనిపించింది అని చెప్పాడు.
మెల్ బోర్న్‌లో అరంగేట్రం చేస్తానని అడిలైడ్ మ్యాచుకు ముందే తెలుసు. దాంతో మ్యాచుకు ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దాంతో నిద్రమాత్ర వేసుకున్నా. ఉదయం తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. జట్టంతా మైదానంలో ఉండటంతో.. నాకు అరంగేట్రం చేస్తున్న అనుభూతి కలగలేదు. సాయంత్రం బ్యాటింగ్ కు దిగినప్పుడు 10-12 బంతులు ఎదుర్కొన్నంత వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నానన్న ఆత్రుత కలిగింది. అత్యుత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నేను మరింత శ్రద్ధగా ఆడాలని ఆ తర్వాత నాకు నేనే చెప్పుకున్నా. అలాగే ఆడాను. కానీ భారీ స్కోర్ చేయలేకపోయా అని తెలిపాడు.