Begin typing your search above and press return to search.
సిఎం ఇంటికెళ్ళే మార్గంలో కుంగిన భూమి!
By: Tupaki Desk | 23 Oct 2020 11:00 PM ISTజగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే తాడేపల్లి మండలం మెయిన్ రెడ్డు భూమి కుంగిపోయింది. ప్రతిరోజు జగన్ తాడేపల్లి మండలంలోని మెయిన్ రోడ్డు మీద నుండి రాకపోకలు సాగిస్తుంటారు. కారణాలు తెలియలేదు కానీ మధ్యాహ్నం హఠాత్తుగా మెయిన్ రెడ్డు కుంగిపోవటంతో స్దానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా అయ్యింది. దాంతో అదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరు చూస్తుండగానే సుమారు మూడు అడుగుల వెడల్పుతో ఆరు అడుగుల లోతున పెద్ద గొయ్యిపడింది.
అదే సమయంలో అదే రోడ్డుపై వస్తున్న మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృఫ్ణరెడ్డి దీన్ని గమనించారు. వెంటనే అక్కడి నుండే అధికారులకు ఫోన్లు చేశారు. వాళ్ళు రాగానే విషయమంతా చూపించి వెంటనే మరమ్మత్తులు చేయాలంటూ కోరారు. అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగేశారు. మరమ్మత్తులకు సమయం పడుతుంది కాబట్టి ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలను అధికులు నిలిపిశారు.