Begin typing your search above and press return to search.
మోడీకి కరోనా సోకి ఉంటుందా .. కారణం ఇదే !
By: Tupaki Desk | 13 Aug 2020 10:30 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్య సైతం అధికంగానే ఉన్నాయి. సామాన్యుల నుండి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా భారిన పడుతున్నారు. ఈ సమయంలోనే తాజాగా ప్రధాని మోడీకి కరోనా భారిన పడ్డారా అంటూ చర్చ మొదలైంది. దీనికి ప్రదాన కారణం ఏమిటి అంటే ..అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడి మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు కూడా పాల్గొన్నారు.
అయితే , అయన గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే , కరోనా నిర్దారణ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. శ్వాసతీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆయనను వైద్యులు పరీక్షించగా.. కరోనా సోకినట్టు పరీక్షల్లో తెలిసింది. నృత్య గోపాల్ దాస్ అనారోగ్యానికి గురయినట్టు తెలిసిన వెంటనే మథురకు యూపీ ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని పంపింది. ప్రస్తుతం ఆశ్రమంలోనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సీఎం యోగి అయన ఆరోగ్యం పై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన అనుచరులు, మథుర కలెక్టర్‌తో యోగి మాట్లాడారు. అనంతరం మేదాంత హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నరేశ్ త్రేహాన్ తో మాట్లాడిన సీఎం యోగి.. అవసరమైతే గోపాల్ దాస్ ను గురుగ్రామ్ లో ఆస్పత్రికి తరలించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రతి ఏడాది మథురలో జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో మహంత్ నృత్య గోపాల్ దాస్ పాల్గొంటారు. ఈ ఏడాది కూడా జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే , ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనితో ప్రధాని మోడీకి కూడా ఏమైనా కరోనా సోకి ఉంటుందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ..కొందరు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.