Begin typing your search above and press return to search.

శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ : కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు

By:  Tupaki Desk   |   10 May 2023 9:38 PM GMT
శ్రీ ఆత్మసాక్షి  ఎగ్జిట్ పోల్ : కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు
X
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఈ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పోటెత్తాయి. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ నే అత్యధిక సీట్లు గెలుస్తుందని.. వీలైతే అధికారం సాధిస్తుందని తేల్చాయి. అయితే హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనావేశాయి. అయితే అన్ని సంస్థలు సర్వేల పేరిట హల్ చల్ చేస్తాయి. కానీ కొన్ని సంస్థల సర్వేలు మాత్రమే నిక్కచ్చిగా ఉంటాయి. వాళ్లు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం సేకరించి మరీ ప్రజానాడిని బయటపెడుతారు.

అలా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఎప్పుడూ నిజమే చెప్పింది. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ (S.A.S Group).. తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయత గల సర్వే సంస్థ గా పేరుంది. .. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన మూర్తి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా.. సెప్తోలజిస్ట్ గా సేవలందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. తాజాగా మరోసారి ఈ సంస్థ విశ్వసనీయంగా బయటపెట్టిన కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకోవడం ఖాయమని అంటున్నారు.

హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆత్మసాక్షి గ్రూపు తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. కాంగ్రెస్ కు 117-124 ఎమ్మెల్సీ సీట్లు వచ్చి క్లియర్ కట్ గా ఎవరి పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తుందని తేల్చింది. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ సీట్లు 224 సీట్లు కాగా.. మేజిక్ ఫిగర్ 113.

ఇక బీజేపీకి 83-94 అసెంబ్లీ సీట్లు వచ్చి రెండో స్థానం దక్కించుకుంటుందని శ్రీఆత్మసాక్షి తెలిపింది. జేడీఎస్ కు 23-30 అసెంబ్లీ స్థానాలు రావచ్చని అంచనా వేసింది. ఇతరులు 2-8 సీట్లలో గెలవవచ్చని పేర్కొంది.

ఓట్ల శాతం చూసుకుంటే బీజేపీకి 34.5 శాతం ఓటు బ్యాంక్, కాంగ్రెస్ కు 42.5 శాతం ఓట్లు, జేడీఎస్ 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

కర్ణాటకలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో బెంగళూరు అర్బన్ లో కాంగ్రెస్ కు 41.5 శాతం, బీజేపీకి 37 శాతం, జేడీఎస్ కు 16 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

ఇక ఓల్డ్ మైసూర్ లో బీజేపీకి 18 శాతం, కాంగ్రెస్ కు 39శాతం, జేడీఎస్ కు 35.5 శాతం ఓటు బ్యాంక్ రావచ్చని అంచనావేసింది.

ముంబై కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి 37.5 శాతం, బీజేపీకి 45 శాతం, జేడీఎస్ కు 9 శాతం రావచ్చని తెలిపింది.

కోస్టల్ కర్ణాటక లో బీజేపీకి 44.5 శాతం, కాంగ్రెస్ కు 41 శాతం, జేడీఎస్ 7.5 శాతం వస్తుందని తేలింది.

హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీకి 34 శాతం, కాంగ్రెస్ కు ఇక్కడ అత్యధికంగా 45 శాతం ఓటు బ్యాంకు రానుందని తెలిపింది.

ఇక సెంట్రల్ కర్నాటకలో బీజేపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 43 శాతం , జేడీఎస్ కు 13 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉంది.

ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ, ఏపీలను ఆనుకొని ఉన్న తెలుగు ప్రాంతాల ప్రభావం చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండి ఎక్కువ సీట్లు సాధిస్తోంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపునిచ్చే అంశం. ఇక కర్ణాటక తీరప్రాంతాల్లో ముంబై కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది.. లీడింగ్ లో రానుంది. ఇక దక్షిణ కర్ణాటకలో జేడీఎస్ బలంగా ఉండి మెజార్టీ సీట్లను దక్కించుకోనుంది. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

ఓవరాల్ గా శ్రీఆత్మసాక్షి సర్వేలో ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి రానుందని తేల్చింది.