శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఏ. ఎస్ గ్రూప్ ) సంచలన సర్వే ఫలితాలు ఇపుడు ఏపీని ఒక కుదుపు కుదుపుతున్నాయి. వై నాట్ 175 అంటూ ధీమాగా ఉన్న వైసీపీకి ఈ ఫలితాలు కొంత ఇబ్బంది పెడుతూండగా మాకు 160 సీట్లు అంటున్న టీడీపీ గెలుపు దగ్గరలో ఉండడం విశేషం. అయితే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా మెజారిటీ సీట్లు సాధించగలదు అన్న నమ్మకాన్ని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తునాయి.
ఇదిలా ఉంటే ఈ సర్వే మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మొత్తానీకి మొత్తం సీట్లు గెలిచి వైసీపీ స్వీప్ చేసి పారేసింది. మరి 2024లో అదే మ్యాజిక్ వైసీపీ కంటిన్యూ చేస్తుందా అంటే ఈ జిల్లా వరకూ చూసుకుంటే శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఏ. ఎస్ గ్రూప్ ) సర్వే కాదనే అంటోంది. ఈసారి టీడీపీకి సీట్లు బాగా వస్తాయని తేల్చి చెబుతోంది.
ఆ వివరాలు చూస్తే మొత్తం తొమ్మిది సీట్లలో తెలుగుదేశం ఏకంగా నాలుగు సీట్లలో గెలుస్తుందిట. వైసీపీకి మూడు సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు మరో రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుంది అని సర్వే చెబుతోంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లు విజయనగరం, బొబ్బిలి, ఎస్ కోట, గజపతినగరం, అలాగే వైసీపీ గెలిచే సీట్లు తీసుకుంటే చీపురుపల్లి, సాలూరు, నెల్లిమర్లగా ఉన్నాయి. గట్టి పోరు గా చూస్తే పార్వతీపురం, కురుపాం లలో హోరాహోరీ ఉంటుంది అని అంటున్నారు.
ఇక మంత్రులు ఇద్దరూ బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర గెలిచి తీరుతారు అని సర్వే చెబుతోంది. అదే టైంలో మాజీ డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణికి పోటా పోటీగా సీటు ఉంది అంటున్నారు. అలాగే ఓడిపోయే వారి జాబితాలో గజపతినగరం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనరసయ్య ఉండడం విశేషం. ఇక బొత్స బంధువుగా ఉన్న ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు, డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఉండడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.