Begin typing your search above and press return to search.

శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వే : విశాఖ జిల్లాలో హిట్ కొట్టేది ఎవరంటే...?

By:  Tupaki Desk   |   7 March 2023 8:00 AM GMT
శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్  (SAS Group) సంచలన సర్వే : విశాఖ జిల్లాలో హిట్ కొట్టేది ఎవరంటే...?
X
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి 2019లో ఇందులో పదకొండు సీట్లను వైసీపీ సునాయాసంగా గెలుచుకుంది. ఈసారి మళ్ళీ అన్ని సీట్లనే సాధించాలని చూస్తోంది. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చాక ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. మరో వైపు చూస్తే వైసీపీకి ఉన్న వ్యతిరేతక ఎంత విశాఖ జిల్లాలో తెలుగుదేశం పుంజుకుందా లేదా అన్న దాని మీద చూస్తే శ్రీ అత్మ సాక్షి ఎస్ ఏ ఎస్ గ్రూప్ (SAS Group) ) సంచలన సర్వే కీలక విషయాలు బయటపెట్టింది.

ఆ సర్వే ప్రకారం చూస్తే మొత్తం పదిహేను సీట్లకు గానూ టీడీపీకి ఏడు సీట్లు వస్తాయని లెక్క తేల్చింది. వైసీపీకి అయిదు సీట్లు దక్కుతాయని వెల్లడించింది. మిగిలిన మూడు చోట్ల హోరాహోరీ పోటీ ఉంటుంది అని పేర్కొంది. అంటే మెజారిటీ సీట్లు టీడీపీకే లభిస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయన్న మాట.

నియోజకవర్గాల వారీగా చూస్తే టీడీపీకి దక్కే సీట్లు ఇలా ఉన్నాయి. విశాఖ తూర్పు, విశాఖపట్నం పశ్చిమం, భీమునిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్శీపట్నం గా పేర్కొంటున్నారు. అదే వైసీపీకి దక్కే సీట్లు చూస్తే విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, ఎలమంచిలి, అరకువాలీ, పాడేరుగా ఉన్నాయి. ఇక హోరా హోరీ పోటీ అన్నదగ్గ సీట్లు చూస్తే పాయకరవుపేట, గాజువాక, మాడుగులగా ఈ సర్వే పేర్కొంది.

అంటే మొత్తం సీట్లలో ఎక్కువ సీట్లు తెలుగుదేశం గెలుచుకుని తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటుందని ఈ సర్వే చెబుతోంది అన్న మాట. విశాఖ జిల్లాలో ఒకపుడు టీడీపీకి మంచి పట్టు ఉండేది. 2019లో మాత్రం వైసీపీని విజయం వరించింది. కానీ 2024లో మాత్రం టీడీపీ పునర్వైభవం సాధిస్తుంది అని ఈ సర్వేను బట్టి తెలుస్తోంది. చూడాలి మరి రియల్ గా జరిగిఏ ఫైట్ లో ఏ సంగతిని జనాలు తేలుస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.