Begin typing your search above and press return to search.

విశాఖ బాలిక కేసులో వెలుగులోకి షాకింగ్ అంశాలు

By:  Tupaki Desk   |   9 Oct 2021 6:06 PM IST
విశాఖ బాలిక కేసులో వెలుగులోకి  షాకింగ్ అంశాలు
X
విశాఖపట్నంలో లో అనుమానాస్పదంగా మృతి చెందిన మైనర్ బాలిక కేసుపై సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియా సమావేశంలో నిందితుడు కార్పెంటర్ నరేష్‌ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. బాలిక ఎదురింటిలో నివాసముంటున్న కార్పెంటర్ దిగుమర్తి నరేష్ తో ఏర్పడిన పరిచయం ప్రమాదకరంగా మారిందని అన్నారు. మైనర్ బాలికకు, నరేష్ లు తరచుగా ఫోన్ చూసుకునేవారని, ఇద్దరి మధ్య 117 ఫోన్ కాల్స్ ఉన్నాయని అంతేకాదు అనేక మెసేజెస్ ఉన్నాయని చెప్పారు మనీష్ కుమారు.

ఇక ఇద్దరి ఇల్లులు ఎదురెదురుగా ఉండడంతో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఇద్దరూ ప్రైవేట్ గా అనేకసార్లు కలిశారని తెలిపారు. బాలికకు అసభ్యకరమైన వీడియో లు చూపించి నరేష్ లొంగదీసుకున్నాడని మనీష్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 వ తేదీ రాత్రి బాలికను తన రూం కి రమ్మని నరేష్ కోరాడు. బాలిక నరేష్ రూమ్ లో ఉన్న సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ వెదకడం చూశారు. దీంతో నరేష్ ఆ బాలికను తన రూమ్ నుంచి టెర్రస్ మీదకు వెళ్ళమని ఫోర్స్ చేశాడు. బాలిక టెర్రస్ మీదకు వెళ్లగా.. అక్కడ బాలిక ఎదురుగా ఉన్న ఆ[అపార్ట్మెంట్ టెర్రస్ తన తన తండ్రిని చూసింది. దీంతో బాలిక బయపడి.. అక్కడ నుంచి దూకేసిందని సీపీ మనీష్ కుమార్ చెప్పారు.

ఈ ఘటన లో అసలేమైంది అంటే .. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన కుటుంబం ఉపాధి కోసం విశాఖపట్నంకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు అగనంపూడిలోని ఓ అపార్ట్ మెంట్‌ లో ఉంటున్నారు. తండ్రి అదే ఆపార్ట్‌ మెంట్‌ కు వాచ్‌ మెన్‌ గా పనిచేస్తున్నాడు. వారికి 14 ఏళ్ల కుమార్తె సంతానం. బాలిక కుటుంబం ఉంటున్న అపార్ట్‌ మెంట్ పక్కనే ఉండే ఆదిత్య అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెం.101లో విజయనగరం జిల్లా కొత్తపేట సమీపంలోని గొల్లపేటకు చెందిన కార్పెంటర్ దిగుమతి నరేష్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన నరేష్.. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లోబరుచుకున్నారు. ఆ తర్వాత బాలికకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరకంగా అనుభవించేవాడు. దాదాపు గత రెండు నెలలుగా వీరిద్దరి మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. ఇదే క్రమంలో తాము వచ్చిన పని అయిపోవడంతో స్వగ్రామానికి వెళ్లిపోతున్నామని.. చివరిసారిగా కలిసేందుకు రావాలని నరేష్ బాలికను కోరాడు.

దీంతో ఆమె రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు నిద్రించిన తర్వాత నరేష్ వద్దకు వెళ్లింది. అయితే మంగళవారం రాత్రి 9 గంటల నుంచి కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించం ప్రారంభించారు. ఈ క్రమంలో బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో బాలిక, నరేష్ మేడపైన కలిసి ఉన్నారు. ఈ క్రమంలో లైట్లు వేసి వెతుకుతుండటంతో భయపడ్డ ఆ యువకుడు ఇంటి లోపలికి వెళ్లిపోయాడు.అయితే, ఆ యువకుడు తప్పించుకుని పోవడంతో.. బాలిక ఒంటరిగా అపార్ట్‌మెంట్ మేడపైనే ఉండిపోయింది. అయితే సమయంలో తల్లిదండ్రులు వస్తుండటంతో.. తనను చూస్తారన్న భయంతో మేడపై నుంచి కిందకు దూకేసింది. ఆమెకు కాలి ఎముకలు విరగడంతో పాటు శరీరంలో నరాలు చిట్లిపోయి స్పాట్‌లోనే చనిపోయింది. ఉదయం బాలిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమవివ్వగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేశారు.

ఈ క్రమంలో బాలిక ఎందుకు, ఎలా మరణించిందన్న దానిపై పోలీసులు తీవ్రంగా విచారణ చేపట్టారు. ఎన్ని కోణాల్లో విచారించినా క్లూ దొరక్కపోవడంతో.. మృతురాలు చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్‌ను విశ్లేషించారు. దీంతో పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నరేష్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. అప్పటికే అతడు తప్పించుకునేందుకు ప్లాన్ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పాడు.