Begin typing your search above and press return to search.

ట్రంప్ నకు జైలుశిక్ష తప్పదా?

By:  Tupaki Desk   |   20 Jan 2021 8:00 AM IST
ట్రంప్ నకు జైలుశిక్ష తప్పదా?
X
సాధారణంగా అమెరికా మాజీ అధ్యక్షులు...తమ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆటో బయోగ్రఫీ రాయడంలోనో, గోల్ఫ్ ఆడడంలోనో, వేరే వ్యాపకాలు, వ్యాపారాలతో బిజీగా ఉంటారు. కానీ, అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం...మాజీ అయిన తర్వాత తన శేష జీవితాన్ని జైలులో గడిపే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ట్రంప్ నకు చిప్పకూడు తప్పదని, ట్రంప్ ను కటకటాల్లోకి నెట్టేందుకు క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి ఘటన ఒక్కటి చాలని అనుకుంటున్నారు. తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టి ఆ దాడికి పురిగొల్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్ నకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నకు శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదని ప్రచారం జరుగుతోంది.

క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి ఘటనలో ట్రంప్ పాత్ర నిజమని నిరూపితమైతే ఆయనకు జైలుశిక్ష తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే సెనేట్ ట్రయల్ లో ట్రంప్ దోషి అని తేలితే శిక్ష తప్పదని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటళ్ళు, గోల్ఫ్ రిసార్ట్ లు కూడా చిక్కుల్లో పడతాయని చెబుతున్నారు. కానీ, న్యాయపరంగా ట్రంప్ నకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆయన మద్దతుదారులు విశ్వప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు, క్యాపిటల్ ఘటనకు ముందే ఆయనపై చాలా కేసులున్నాయని, ఆయనకు శిక్ష తప్పదని బైడెన్ మద్దతుదారులు చెబుతున్నారు. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.