Begin typing your search above and press return to search.
మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ దూరంగా ఉండనుందా?
By: Tupaki Desk | 7 Dec 2020 9:46 AM ISTగ్రేటర్ ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీకి తగిలిన షాక్ తెలిసిందే. గతంలో 99 డివిజన్లను సొంతం చేసుకున్న ఆ పార్టీకి తాజా ఎన్నికల్లో కేవలం 55 స్థానాలకు పరిమితం కావటం తెలిసిందే. మేయర్ ఎన్నికకు అవసరమైన బలం లేని వేళ.. టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ భవన్ కు గెలిచిన కార్పొరేటర్లను.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఆహ్వానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. అనధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మేయర్ ఎన్నికను ఏం చేద్దామని గెలిచిన కార్పొరేటర్లను కేటీఆర్ అడగ్గా.. పలువురు స్పందించినట్లు తెలుస్తోంది. బలం లేదన్న మాటను కొందరు కార్పొరేటర్లు ప్రస్తావించగా.. వారి మాటల్ని విన్న కేటీఆర్ అనూహ్యంగా స్పందించినట్లు సమాచారం.
మేయర్ ఎన్నికకు అవసరమైన మెజార్టీ లేని నేపథ్యంలో మద్దతు అడగటం ఎందుకు? బద్నాం కావటం ఎందుకు? ఏం జరుగుతుందో చూద్దాం? అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని.. అసలు కేటీఆర్ నోటి నుంచి అలాంటి మాట రాలేదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. మేయర్ ఎన్నికపై కేటీఆర్ మాట్లాడినట్లుగా చెబుతున్నట్లుగా వచ్చిన మాటలు మొత్తం పక్కా ప్లానింగ్ లో భాగమేనని వాదిస్తున్న వారు లేకపోలేదు.
మేయర్ పీఠం మీద తమకు ఆసక్తి లేదన్న భావనను కలుగజేయటంతో పాటు.. మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకోమన్న సంకేతాన్ని ప్రజలకు పంపేలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరికొద్ది నెల్లలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న వేళ.. మేయర్ పీఠం మీద తొందరపడి వ్యాఖ్య చేస్తే జరిగే నష్టాన్ని గుర్తించి.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మద్దుతు అడగాలన్న ఆలోచన లేదన్న మాట కేటీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అసలు అలాంటి మాటలు కేటీఆర్ నోటి నుంచి రాలేదని.. మేయర్ ఎన్నిక గురించి ప్రస్తావించి.. కొందరి అభిప్రాయాల్ని తీసుకొని ఫిబ్రవరి 10 వరకు టైం ఉందిగా? అప్పుడు చూద్దామన్న వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు.