Begin typing your search above and press return to search.

మోడీ జ‌లాస్త్రంతో పాక్ ప‌ని ఖేల్ ఖ‌తం

By:  Tupaki Desk   |   23 Sept 2016 5:52 PM IST
మోడీ జ‌లాస్త్రంతో పాక్ ప‌ని ఖేల్ ఖ‌తం
X
భారత్‌ లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందా? సరిహద్దుల్లో చొరబాటు భార‌త్‌ పై యుద్ధానికి సిద్ధ‌మ‌న్న సంకేతాలా ? భార‌త్‌ ను నేరుగా ఎదుర్కోలేక పాకిస్తాన్ దొంగ‌చాటు దెబ్బ‌కొట్టేందుకు రెడీ అవుతోందా ? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు భార‌త్‌ నే కాదు..యావ‌త్ ప్ర‌పంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. గ‌త ఆదివారం జమ్మూకశ్మీర్‌ యూరీ సెక్టార్‌ లో పాక్‌ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఉరీ సెక్టార్‌ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన మార‌ణ‌హోమంలో 18 మంది మ‌న జ‌వాన్లు.. వీర మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో భార‌త్‌ తో పాటు ప్ర‌పంచ‌ దేశాల‌న్ని నివ్వెర‌పోయాయి. పాకిస్తాన్‌ కు తెర‌చాటుగా స‌పోర్ట్ చేసే అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ విష‌యంలో పాకిస్తాన్‌ పై క‌త్తులు నూరుతోంది. ఈ దాడి త‌ర్వాత పాకిస్తాన్ అంత‌ర్జాతీయంగా పెద్ద డిఫెన్స్‌ లో ప‌డిపోయింది.

నేరుగా భార‌త్‌ తో యుద్ధం చేయాల్సి వ‌స్తే భార‌త్‌ ను క‌నీసం రెండు రోజులు కూడా భార‌త్‌ ను ​​నిలువ‌రించే స‌త్తా ​​
పాకిస్తాన్‌ కు లేదు. అప్పుడ‌ప్పుడు ఇలా దొంగ దెబ్బ‌లు తీస్తూ తాము గొప్ప అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్ప పాక్ చేయ‌గ‌లింగిందేమి లేదు. భార‌త్‌ తో నేరుగా పాక్ యుద్ధం చేయ‌నూ లేదు...తోక‌ముడ‌చుకుని కూర్చోనూ లేదు.
​​​పా​క్ తాజా దాడుల నేప‌థ్యంలో ఆ దేశంపై యుద్ధం చేయాల‌న్న ఒత్తిళ్లు తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ యుద్ధం చేయాకుండానే పాకిస్తాన్‌ ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధానాలు వి​​నిపిస్తున్నాయి. మోడీ కేవ‌లం జలాస్త్రం అనే బాణం ద్వారా పాకిస్తాన్‌ ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఈ జ‌లాస్త్రం స్టోరీ ఏంటంటే భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య స‌రిహ‌ద్దులో ప్ర‌వ‌హిస్తోన్న సింధూ న‌దీ జ‌లాల పంపిణీపై 56 సంవ‌త్స‌రాల క్రితం రెండు దేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఈ ఒప్పందం ప్ర‌కారం పంచ‌న‌దుల్లో బియాస్ - రావి - సట్లేజ్ నదులపై భారత్‌ కు హక్కులున్నాయి. జమ్ము కాశ్మీర్‌ నుంచి ప్రవహించే సింధు - చినాబ్ - జీలం నదులపై పాకిస్థాన్‌ కు కంట్రోల్ ఉంటుంది.

ఈ ఒప్పందం ర‌ద్దు అయితే పాకిస్తాన్‌ కు నీరు వెళ్ల‌దు...ఆ దేశం ఎడారిగా మార‌డం ఖాయం. అక్క‌డ కొన్ని ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ప‌డించుకునేందుకు నీరు ఉండ‌దు. పాకిస్తాన్ తెర‌వెన‌క ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ఇస్తూ భార‌త్‌ ను దెబ్బ‌కొడుతున్న‌న్ని రోజులూ ఈ సింధూ జ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాల‌నే ప్లాన్‌ లో మోడీ స‌ర్కార్ ఉంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఒక్క బుల్లెట్ పేల‌కుండానే..చిన్న ర‌క్తం చుక్క కూడా చింద‌కుండానే పాకిస్తాన్ దారిలోకి రావ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.