Begin typing your search above and press return to search.

రాహుల్ కు బాంబు కట్టి పంపిద్దాం

By:  Tupaki Desk   |   23 April 2019 12:11 PM IST
రాహుల్ కు బాంబు కట్టి పంపిద్దాం
X
బాలా కోట్ వైమానిక దాడులు ఉట్టివేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలకు మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ్ ముండే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ప్రముఖ మహారాష్ట్ర నేత గోపీనాథ్ ముండేకు కూతురు పంకజ్ ముండే కావడం విశేషం.

మహారాష్ట్ర మహిళా శిశుసంక్షేమ మంత్రిగా చేస్తున్న పంకజ్ ముండే 21న జల్నా -పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.. ‘బాలాకోట్ పై బాంబులు వేయలేదని ఎద్దేవా చేస్తున్న రాహుల్ గాంధీకి ఒక బాంబును చుట్టే ఏదైనా దేశానికి పంపిద్దామని.. అప్పుడైనా బీజేపీ బాంబులు వేసిందని అర్థం చేసుకుంటుందని.. పాకిస్తాన్ లోని జైషీ అహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ బాంబులు వేయలేదనడానికి ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ పేరిట పాకిస్తాన్ లోని బాలాకోట్ పై దాడి చేసింది. ఈ దాడులను కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ - మమతా బెనర్జీ వంటి అనేక ప్రతిపక్ష నాయకులు వాయు దాడులపై.. దాని ప్రభావంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలను - సందేహాలను వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అయితే అసలు దాడులే జరగలేవని సందేహాలు వ్యక్తం చేసింది. దీనిపై పంకజ్ ముండే తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.