Begin typing your search above and press return to search.
శ్రావణ మాసంలో షాపులు తెరవాలంటే 3-4కోట్లు ఎమ్మెల్యేలకు ఇవ్వాలంట?
By: Tupaki Desk | 3 Aug 2020 5:03 PM ISTఅందని కాడికి.. అందనికాడికి దోచుకునే పనిలో పడ్డారు ఆ ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ఎంతో కష్టపడుతూ పథకాలు అమలు చేస్తూ ఓ వైపు సంక్షేమ రాజ్యాన్ని సృష్టిస్తుంటే.. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఆర్థికంగా దెబ్బతిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదాయం లభించే ఏ మార్గాలను వదలడం లేదని జిల్లాలో వ్యాపారస్థులు వాపోతున్నారు. ఆఖరు వ్యాపారాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు లంచాలు అడుగుతున్నారని కుమిలిపోతున్నారని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో శ్రావణ మాసంలో బంగారు, బట్టల దుకాణాలు తెరుచుకోవడానికి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే ‘తెరుచుకోవాలంటే ఒక ఎమ్మెల్యే 4 కోట్లు.. ఇంకో ఎమ్మెల్యే 3 కోట్లు’ అడిగారు అని లోకల్ వ్యాపారులు వాపోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే వ్యాపారస్థులు మేము ఇవ్వం అని సైలెంట్ అయిపోతే ఒక ఎమ్మెల్యే తండ్రి కూర్చొని సెటిల్ చేద్దాం రండి అని కబురు పంపాడట.. కానీ మీ సెటిల్ మెంట్ వద్దు.. మాకు బిజినెస్ వద్దు అని వ్యాపారస్థులు డిసైడ్ అయ్యారట.. ఓట్ల కోసం వస్తారు కదా అప్పుడు చూసుకుందాం లే అని వ్యాపారస్థులు కూడా పంతం పట్టారట.. ఈ మేరకు ప్రకాశం జిల్లాలోని ప్రజల్లో ఎమ్మెల్యేల తీరుపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారట.. ఏడాదికే ఇలా పీక్కుతింటే ఎలా అని వాపోతున్నారట..