Begin typing your search above and press return to search.

వధువు కావలెను అని షాప్‌ ముందు బోర్డ్ పెట్టాడు..ఆ తర్వాత ఏమైందంటే

By:  Tupaki Desk   |   1 Sept 2021 3:41 PM IST
వధువు కావలెను అని షాప్‌ ముందు బోర్డ్ పెట్టాడు..ఆ తర్వాత ఏమైందంటే
X
వధువు, వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా పేపర్స్ ‏లలో, మ్యాట్రిమోనీ సైట్స్‏ లలో ప్రతిరోజూ కూడా చూస్తూనే ఉంటాం. ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. అందరూ వెళ్లే దారిలో వెళ్లడం కొందరికి నచ్చదు. అందరూ చేసినట్లు వారు చెయ్యాలి అనుకోరు. కాస్త కొత్తగా చేద్దామనే ఆలోచనలు వారికి ఉంటాయి. కేరళ త్రిచూర్‌ లోని 33 ఏళ్ల ఉన్నికృష్ణన్ అదే చేశాడు. తన పెళ్లికి సంబంధించి పెళ్లిళ్ల పేరయ్యనో లేక, షాదీ వెబ్‌ సైట్ల నో కలవకుండా, తన టీ స్టాల్ ముందే వధువు కావాలి అని బోర్డు పెట్టాడు.

కులం, మతంతో సంబంధం లేదు అని రాసి తన మొబైల్ నంబర్ ఇచ్చాడు ఈ వల్లచిర స్థానికుడు. తన వయసు 33 కాబట్టి, తనకు ఎవరో ఒకరు జీవిత భాగస్వామిగా వస్తే బాగుండు అనుకున్నాడు. అంతలోనే షాక్ అయ్యాడు. అయితే ఉన్నికృష్మన్ తగిలించిన సైన్ బోర్డును అతని ఫ్రెండ్ ఫోటో తీసి సోషల్ మీడియాల అప్‏లోడ్ చేశాడు. దీంతో నెట్టింట్లో ఉన్నికృష్ణన్ బోర్డు తెగ వైరల్ అయ్యింది. అతనికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి.

అయితే ఉన్నికృష్ణన్‏కు ఇదంతా తెలియదు. అతను తిరిగ్గా షాపులో కూర్చుని తనకు వచ్చిన ప్రపోజల్స్ వెతికే పనిలో ఉన్నాడు. నేను రోజువారీ కూలీని. నా తలలో కణతి ఉండటంతో సర్జరీ కూడా జరిగింది. దాని నుంచి పూర్తిగా రికవరీ అయ్యాను. అందువల్ల ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. లక్కీగా ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నను. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. అవేవీ సెట్ కాలేదు. అందుకే ఇలా సైన్ బోర్డ్ పెట్టాను అని ఉన్నికృష్ణన్ తెలిపాడు.

ఉన్ని ఫ్రెండ్ ఏమన్నాడు అంటే..నా పేరు సాజీ. నేనే ఆ సైన్ బోర్డ్ ఫొటో తీసి ఫేస్‌ బుక్‌ లో పెట్టాను. ఇప్పుడు ఉన్నికి వేరే దేశాల నుంచి మలయాళీలు ఫోన్లు చేస్తున్నారట. కొంత మంది ఉన్నికి మంచి భవిష్యత్తు ఉండాలని కాల్ చేసి విషెస్ చేస్తున్నారు. కులం, మతంతో సంబంధం లేదని ఉన్ని చెప్పడం చాలా మందికి నచ్చుతోంది. ఓ వ్యక్తి మాత్రం జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో వెతుక్కుంటారా ఎవరైనా అని సీరియస్ అయ్యాడు అని సాజీ తెలిపాడు ప్రస్తుతం ఉన్నికృష్ణన్‌కి రోజూ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది పూర్తి వివరాలు ఇవ్వమని అడుగుతున్నారు. అయితే, ఆ వివరాల్ని సోషల్ మీడియాలో పెట్టమని అడుగుతున్నారు. అతనికి మంచి జీవిత భాగస్వామి దక్కాలని కోరుకుందాం