Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు షాకులే షాకులు .. అంతరీక్ష ప్రయోగం విఫలం!

By:  Tupaki Desk   |   13 Sept 2020 1:40 PM IST
డ్రాగన్ కు షాకులే షాకులు ..  అంతరీక్ష ప్రయోగం విఫలం!
X
ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుదామనుకున్న చైనాకు ఇటీవల షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. కరోనా మహమ్మారి విషయంలో ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ చైనా మీదవిరుచుకుపడుతున్నాయి. మన దేశంతో కయ్యానికి కాలుదువ్వడంతో.. కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన యాప్స్​ బ్యాన్​ చేసింది. దీంతో ఆ దేశానికి కోలుకోలేని ఆర్థికనష్టం సంభవించింది. ఇదిలా ఉంటే.. అంతరీక్ష రంగంలోనూ రీసెంట్​గా చైనాకు ఓ షాక్​ తగిలింది. ఆ దేశం ప్రతిష్ఠాత్మకంగా చైపట్టిన శాటిలైన్​ ప్రయోగం విఫలమైంది. ఈ విషయాన్ని స్వయంగా చైనాకు చెందిన అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ వెల్లడించడం గమనార్హం.

అంతరీక్ష ప్రయోగాల్లో గత కొంతకాలంగా చైనా దూసుకెళ్తుంది. అమెరికాకు పోటీగా ప్రయోగాలు చేస్తూ సవాళ్లు విసురుతోంది. ఈ క్రమంలో చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా శాటిలైన్​ అనే ప్రయోగాన్ని చైపట్టింది. చైనా గోబీ ఎడారిలోని జిక్వాన్​ శాటిలైట్​ కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) ఈ ఉపగ్రహాన్ని జిలిన్​-1 గావోఫెన్02సీ అంతరిక్షంలోకి పంపారు. భూభాగం మీద ఉన్న ప్రతి వస్తువును చూడగలిగేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. దీనికి ఆప్టికల్​ రిమోట్​ సెన్సింగ్​ను అనుసంధానం చేశారు. క్వాయ్‌జావ్-1ఏ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. రాకెట్ నిర్ణీత క‌క్ష్య‌ను చేరుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. అయితే దీన్ని ముందే గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఎందుక విఫలమైందోనని అక్కడి శాస్త్రవేత్తలు విచారణ జరుపుతున్నారు. కాగా జిక్వాన్​ అంతరీక్ష కేంద్రం నుంచి గతవారం చైనా చేసిన ఓ ప్రయోగం మాత్రం సక్సెస్​ అయ్యింది. లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ ఓ పునర్వినియోగ అంతరిక్షనౌకను గత శుక్రవారం అంతరిక్షంలోకి పంపించారు. ఈ అంతరిక్ష నౌక రెండురోజులు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చింది. ఇదో గొప్ప విజయమంటూ అప్పట్లో చైనా మీడియా తెగ ఊదరగొట్టింది. అయితే తాజాగా నిర్వహించిన ప్రయోగం ఫెయిల్​ కావడంతో ఆ దేశం షాక్​కు గురైంది.