Begin typing your search above and press return to search.

ఉద్యోగులకి షాక్ ఇచ్చిన కేంద్రం ..ఆ ఉత్తర్వులు ఉపసంహరణ !

By:  Tupaki Desk   |   19 May 2020 1:45 PM IST
ఉద్యోగులకి షాక్ ఇచ్చిన కేంద్రం ..ఆ ఉత్తర్వులు ఉపసంహరణ !
X
ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో గత రెండు నెలలుగా చాలామంది ఉద్యోగులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే , కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అయితే, దేశంలో లాక్ ‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య సంస్థ‌లు పనిచేయకున్నా సరే, ఉద్యోగుల‌కు, సిబ్బందికి పూర్తి వేత‌నాలివ్వాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే , తాజాగా కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులని ఉపసంహరించుకుంది.

నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఈ విషయం స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద ఇటీవ‌ల‌ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. లాక్‌ డౌన్ వేల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలు ఎంఎస్‌ ఎం కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆదాయం లేకుండా కంపెనీలు జీతాలు ఎలా చెల్లిస్తాయని ప్రశ్నించింది.

దీనితో నాలుగో విడుత లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో విధులకు హాజరుకాని ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర హోంశాఖ. లాక్‌ డౌన్ కార‌ణంగా ఆదాయం ఆగిపోయిన స‌మ‌యంలో పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. జీతాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకో రాదంటూ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి మొత్తంగా ఇకపై ఆఫీసులకి వెళ్తేనే జీతాలు వస్తాయన్నమాట..