Begin typing your search above and press return to search.
ఈ వీడియో చూశాక.. పవన్ జల్సా మూవీ గుర్తుకు రావటం ఖాయం
By: Tupaki Desk | 26 Aug 2021 5:00 PM ISTభారీ పార్టీ. పెద్ద ఎత్తున మద్యం సీసాలు. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో వివిధ రకాల ఫుడ్.. చేతిలో సిగిరెట్లు.. అంతేనా.. చేతిలో సెల్ ఫోన్ తో చెలరేగిపోతున్న వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇదేం పెద్ద విషయమా? అంతలా అవాక్కు అవ్వాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తొచ్చు. కాకపోతే.. వారంతా ఆ పార్టీ చేసుకుంటున్నది ఇంట్లోనో.. ప్రైవేటు ప్లేస్ లోనో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోని లాకప్ లో. ఏంటి? అవాక్కు అవుతున్నారా?
నిజమే.. ఇప్పుడీ సంచలనం ఢిల్లీలోని లాకప్ లో ఉండి ఇంతటి రాజభోగాల్ని అనుభవిస్తున్నారు. ఈ వీడియో చూసినంతనే పవన్ కల్యాణ్ నటించిన జల్సా మూవీ గుర్తుకు రాకుండా ఉండదు. ఆ సినిమాలో విలన్ ముకేశ్ రుషి జైలు నుంచే సెటిల్ మెంట్లు.. దందాలు చేస్తుంటాడు. విచారణ కోసం కోర్టుకు వెళ్లే సమయంలోనే తాను టార్గెట్ చేసిన వారిని చంపేస్తుంటాడు. ఈ రీల్ సీన్ చూసిన వారు.. రియల్ లైఫ్ లో ఇలాంటివి సాధ్యమా? అసలు అలా ఎలా జరుగుతాయి? అన్న ప్రశ్నలు సంధిస్తుంటారు. అయితే.. ఈ వీడియో చూశాక.. మనసు మార్చుకోవటం ఖాయం.
తాజాగా వైరల్ అయిన వీడియోలో మాత్రం.. నిందితులు ప్రస్తుతం లాకప్ లో ఉన్నారు. లాకప్ లో ఉండే భారీ పార్టీ దుకాణాన్ని పెట్టేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వీరందరిని నీరజ్ బవన.. వారి సోదరులుగా గుర్తించారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. లాకప్ లో ఉన్న నేరస్తులు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ఈ వీడియో చెప్పకనే చెప్పేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అదిరే ట్విస్టు ఏమిటో తెలుసా?
లాకప్ లో తన ప్రత్యర్థి గ్యాంగస్టర్ల ఎంజాయ్ మెంట్ ను.. ఢిల్లీకి చెందిన గ్యాంగ్ స్టర్ నీరజ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో విచిత్రం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం నీరజ్.. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రత్యర్థుల లాకప్ పార్టీని పోస్టు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల నిర్వాకం ఎలా ఉంటుందో ఈ వీడియో స్పష్టం చేసింది. మరి.. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.