Begin typing your search above and press return to search.

వీడేంట్రా బాబు.. దొంగతనం కోసం ఏకంగా క్రేన్ నే తెచ్చాడు

By:  Tupaki Desk   |   16 Dec 2022 11:30 PM GMT
వీడేంట్రా బాబు.. దొంగతనం కోసం ఏకంగా క్రేన్ నే తెచ్చాడు
X
ఎక్కువ కష్టపడకుండా డబ్బు సంపాదించాలంటే అది దొంగతనం వల్లే సాధ్యమవుతుందని అంతా భావిస్తారు. అయితే పోలీసులు పట్టుబడకుండా ఉండేందుకు మాత్రం దొంగలు ఎంతో హార్డ్ వర్క్ చేయాలన్నది దొంగల వర్షన్. ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ గా ఆలోచిస్తూ దొంగతనాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కొందరు దొంగలు వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ములుగు ఏరియాలో ఇండికా విస్టా కారు దొంగతనం జరిగింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఒక కారును దొంగతనం చేయడానికి ఓ వ్యక్తి ఏకంగా క్రేన్ నే ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీంతో ఈ దొంగతనం చేసిన వాడికి బుర్రలో అసలు గుజ్జు ఉందా.. లేదంటే నన్ను ఎవ్వడు పీకుతాడులే అన్న బరితెగింపైన ఈ పనికి అతడిని ఉసిగొల్పి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రేన్ సహాయంతో కారును దొంగలిస్తున్న దృశ్యాలన్నీ కూడా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు అతడిని పట్టుకోవడం పోలీసులకు ఈజీ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్లో జైపాల్ రెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే నిన్న కూడా తన ఇంటి ముందు కారును పార్క్ చేశాడు. తెల్లవారి చూసే వరకు అతడి కారు కన్పించకుండా పోయింది. దీంతో కంగారుపడిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పెద్ద క్రేన్ సహాయంతో జైపాల్ రెడ్డి కారును బయటికి లాక్కొచ్చి రోడ్డుపై నుంచే దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. కారును తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై లారీలు లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ రాగా కొంత ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

దొంగ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎంచక్క కారును క్రేన్ సహాయం తరలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకొని విచారిస్తున్నారు. వీరు దొంగిలించిన కారును స్క్రాప్ చేసి అమ్మినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాన్ని వీడియో చూసిన నెటిజన్లు మాత్రం 'ఇండికా విస్టా' కోసం ఏకంగా క్రేన్ తీసుకు రావాలా? అంటూ సైటర్లు వేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.