Begin typing your search above and press return to search.

డెల్టా, ఒమిక్రాన్ రెండూ సోకితే... మారణహోమం..!!

By:  Tupaki Desk   |   18 Dec 2021 11:00 AM GMT
డెల్టా, ఒమిక్రాన్ రెండూ సోకితే... మారణహోమం..!!
X
చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన వేరియంట్ లతో ప్రపంచ దేశాల కి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ వైరస్.. ఒక్కొక్క దేశంలో తన కేసుల సంఖ్య భారీగా పెంచుకుంటూ పోతుంది. గత ఏడాది భారత్ లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్... దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. అంతేకాకుండా ఇతర దేశాల్లోనూ అల్లకల్లోలం సృష్టించింది.

ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కాకపోవడంతో వైరస్ ని ఎదుర్కొనే శక్తి, సామర్ధ్యాలు ఏ దేశం దగ్గర కూడా అంతగా లేకపోయాయి. దీంతో గడ్డు రోజులు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఓమిక్రాన్ వేరియంట్ కూడా ఇదే బాటలో నడుస్తుంది. ప్రపంచ దేశాలు ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ దెబ్బకి ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. కానీ ఈ వేరియంట్ తన పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. అదే పరిస్థితి భారత్ లో ఏర్పడితే రోజుకు 14 లక్షల పైచిలుకు కేసులు నమోదు కావచ్చని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.

ఇదిలా ఉంటే తాజాగా నిపుణులు జరిపిన అధ్యయనంలో మరో కీలక అంశం వెల్లడైంది. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది డెల్టా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లు ఒకే వ్యక్తికి సోకితే ఎలా ఉంటుంది అనే అంశంపై నిపుణులు పరిశోధన చేశారు. అయితే దీనిలో చాలా ఘోరమైన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే ఈ రెండూ వేరియంట్లు ఒకేసారి మనిషి మీద దాడి చేస్తే మరో కొత్త వేరియంట్ వస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దానిని ఎదుర్కోవడం మానవులకు అసాధ్యమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ పుడితే దానిని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి మానవులకు మాత్రం లేదని పేర్కొన్నారు. ఇదేగాని జరిగితే ప్రపంచమంతా మారణహోమం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కొత్త వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

మనకు తెలిసిన రెండు వేరియనట్లు డెల్టా స్టరైన్, ఒమిక్రాన్. ఏవి సార్స్ కొవిడ్-2 రకానికి చెందినవి. అయితే ఈ రెండు వేరియంట్లలో మనవునిపై ఒకేసారి దాడి చేస్తే కొత్త వేరియంట్ పుడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సూపర్ స్టరైన్. ఇది ఈ రెండు వేరియనట్లు కంటే చాలా ప్రమాదకరమైనది. దీనికి అధిక ప్రోటీన్లు పవర్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు ముప్పై శాతం ఎక్కువ ప్రభావం చూపుతుందని అభిప్రాయ పడుతున్నారు. అందుకే దీనిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పనిగా చెప్తున్నారు.

ఇప్పటికే వివిధ దేశాల్లో ఒమిక్రాన్ సృష్టిస్తోన్న మహోత్పాతం చూస్తే... సూపర్ స్టరైన్ పుట్టుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ కి చెందిన పాల్ బర్టన్ అనే శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. కొత్త వేరియంట్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉందని పేర్కొన్నారు. ఆ వేరియంట్ కి వ్యాక్సిన్ సామర్థ్యం కూడా సరిపోదని అభిప్రాయపడ్డారు. దేనితో పాటు ఎప్పుడు ఉన్న ఒమిక్రాన్ కూడా చాలా ప్రమాదకరమైన వేరియంట్ అని చెప్పారు. ఇది ఒకసారి సోకిన వ్యక్తికి మరో సారి సోకే అవకాశం 5 రెట్లకు పైగా ఉందని తెలిపారు. బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సెంటర్ చెప్తున్న గణాంకాల ప్రకారం డెల్టా కంటే ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైనది అని తెలుస్తోంది. దేనికి వయసు, లింగం, వ్యాక్సిన్ సామర్థ్యంతో సంబంధ లేకుండా సోకిన వ్యక్తికే ఐదు సార్లు సోకే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైంది.