Begin typing your search above and press return to search.
దేశ రాజకీయాల్లో విలక్షణ దళిత దిగ్గజం ‘పాశ్వాన్’
By: Tupaki Desk | 9 Oct 2020 1:45 PM ISTదేశ రాజకీయాల్లో విలక్షణ దళిత దిగ్గజ నేతగా ‘రాంవిలాస్ పాశ్వాన్’ ఉన్నారు.భవిష్యత్తును సరిగ్గా అంచనా వేసి కేంద్రంలో ప్రతీసారి మంత్రి పదవిని ఈయన కొల్లగొడుతుంటారు. బీహార్ దళిత నేతగా రాం విలాస్ పాశ్వాన్ రాజకీయ ట్రెండ్ ను కరెక్ట్ గా పసిగడుతారనే పేరుంది. రాబోయే మార్పులను సరిగ్గా అంచనా వేస్తారనే పేరుంది. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా.. బీజేపీ ఉన్నా.. ప్రధానులు మారినా పాశ్వాన్ మాత్రం కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుంటారు.
లోక్ జనశక్తి పార్టీని (ఎల్జేపీ)ని స్థాపించిన రాంవిలాస్ పాశ్వాన్ 74 ఏళ్ల వయసులో తాజాగా కన్నుమూశారు. బీహార్ ఎన్నికల వేళ ఈ విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వన్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవలే గుండె సర్జరీ చేయించుకున్న ఆయన నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వన్ స్వయంగా ప్రకటించారు.
లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడిగా ఉన్న రాంవిలాస్ పాశ్వన్ ఎనిమిది సార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
*రాం విలాస్ పాశ్వాన్ ప్రస్థానం..
1946 జులై 5న బిహార్ లోని ఖగారియా జిల్లా షాహర్ బన్నీలో ఓ దళితకుటుంబంలో జన్మించాడు. కోసి కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం పాట్నా వర్సిటీలో పీజీ చేశారు.1969లో రాంవిలాస్ పాశ్వన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. అనంతరం 1969లో తొలిసారి సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిహార్ లో దళిత నేతగా గొప్ప గుర్తింపు పొందారు.బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన పాశ్వన్ ఐదు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. దేశంలో ప్రముఖ దళిత నేతల్లో ఈయన ఒకరు. ఈయన లోక్ జనశక్తి పార్టీ సారథి.
*ఎమర్జెన్సీలో జైలు జీవితం
1974లో రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ ల అనుచరుడిగా పాశ్వాన్ లోక్ దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎమర్జెన్సీని ఎదురించారు. జైలు జీవితం కూడా గడిపారు. నాడు మొరార్జీ దేశాయ్ తో విడిపోయారు. 1977లో బీజేపీ సభ్యుడై పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
1983లో దళిత విముక్తి, సంక్షేమం కోసం ‘దళిత సేన’ను స్థాపించారు.బీహార్ లోని అణగారిన పేదలకు, కటిక పేదరికంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు. రాజ్యాధికారం ద్వారానే దళితుల జీవితాలు బాగుపడుతాయని నమ్మేవారు.
1989లో వీపీ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా రాంవిలాస్ పాశ్వాన్ చేరారు. ఆ తర్వాత ప్రధానులు, ప్రభుత్వాలు మారినా కేంద్రమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో సొంతంగా లోక్ జనశక్తి పార్టీ ని స్థాపించి బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.
పాశ్వాన్ కు ఇద్దరు భార్యలు. 1983లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఎయిర్ హోస్టెస్ రీనాశర్మను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి కుమారుడు చిరాగ్ ఇప్పుడు ఎల్జేపీ వారసుడిగా ఉన్నారు. తాజాగా ఎన్డీఏ నుంచి లోక్ జనశక్తిని బయటకు వచ్చింది. బీహార్ ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు చిరాగ్ బీహార్ లో ఒంటరిగా పోటీచేస్తున్నారు. బీహార్ లో నితీష్ కుమార్ ను వ్యతిరేకిస్తున్నారు. బీహార్ ఎన్నికల వేళ ఆయన చనిపోవడం విషాదం నింపింది. -