Begin typing your search above and press return to search.
అందరిని తిట్టినట్లే ప్రవీణ్ సారును తిడితే.. గులాబీ నేతకు కొత్త అనుభవం
By: Tupaki Desk | 11 Aug 2021 9:15 AM ISTరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలానికి తగ్గట్లు మార్పులు మామూలే. అయితే.. కొత్తగా వచ్చిన మార్పుల్ని గమనించకపోతే ఇలాంటి మార్పులు ఖాయం. గతంలో రాజకీయం.. రాజకీయ నేతల మధ్య శత్రుత్వం అన్నది సైద్ధాంతిక విభేదాలతో ఉండేది. అది కాస్తా పార్టీ మధ్య రచ్చగా మారింది. ఇప్పుడు విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోవటం ఎక్కువైంది. గతంలో సైద్ధాంతిక పోరు సల్పిన నేతలకు భిన్నంగా వ్యక్తిగత అంశాల మీద మావట్లాడుకోవటం.. తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. అయితే.. ఇప్పుడు అంతకు మించిన వైనం ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఈ మధ్యనే మాయావతి అధినేత్రిగా ఉన్న బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరటం తెలిసిందే. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి..రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ సార్ వ్యవహారం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. మొదట్లో తనకు రాజకీయాలకు లింకు వద్దన్న ఆయన.. ఇప్పుడు బీఎస్పీలో చేరటం.. ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు షాకింగ్ గా మారాయి.
రాజకీయాలకు కొత్తగా ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఇంత ఘాటుగా విమర్శలు చేయటమా? అని గులాబీ నేతలు పరేషాన్ అయ్యే పరిస్థితి. కేసీఆర్ ను బండకేసి బాదేసినట్లుగా చేసిన విమర్శల్ని చూసి తట్టుకోలేని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. ప్రవీణ్ పై చేసిన ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే.. ప్రవీణ్ సారు మీదనే విమర్శలు చేస్తావా? అంటూ ఒక యువకుడు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన వైనం చూస్తే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ స్వరూపం ఇట్టే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సంపత్ అనే స్వేరో కార్యకర్త ఎమ్మెల్యే గాదరి కిశోర్ కు ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే అన్న మర్యాద లేకుండా.. ‘‘ప్రవీణ్ సార్ ని విమర్శించే కేటగిరీనా నీది. నా జాతి బిడ్డవని మర్యాదగా మాట్లాడుతున్నా. అదే ఇంకోడైతే వేరేగా ఉండేది . నువ్వు ఎవరైతే నాకేంది? నువ్వు నా ఈకతో సమానం’ అంటూ ఎమ్మెల్యేతో పరుషంగా మాట్లాడాడు సంపత్. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గాదరి కిశోర్.. ‘ఏం బెదిరిస్తున్నవ. చూస్తావా గాదరి కిషోర్గాడేందో’ అంటూ బదులిచ్చినట్లుగా ఆడియో క్లిష్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అందిన కంప్లైంట్ కు పోలీసులు స్పందించారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంటకు చెందిన నగేశ్ తో పాటు.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంపత్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా చూస్తుంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న రాజకీయానికి భిన్నమైన రాజకీయం మొదలైందన్న భావన కలుగక మానదు.