Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో షాకింగ్ సీన్.. సినిమాల్లో కూడా ఉండదేమో?
By: Tupaki Desk | 26 Aug 2020 2:20 PM ISTఇప్పుడు మీరు చదివే ఉదంతం లాంటివి ఎంత దరిద్రపుగొట్టు సినిమాలో కూడా కనిపించదేమో? ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే.. ఇంట్లో వారికి చెప్పేయాలి. కాదంటే.. కాబోయే మొగుడికి విషయం చెప్పి ఒప్పించాలి. అది కూడా సాధ్యం కాదంటే.. బోలెడన్ని మార్గాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇంట్లో వారికి తల కొట్టేసేలా.. కాబోయే మొగుడికి దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చిన ఉదంతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికంగా సంచనలంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
కారు దిగిన ఆమె.. ప్రియుడికి పెళ్లైన భర్త ముందే ముద్దు పెట్టేసింది. దీంతో.. వారికేం చేయాలో పాలుపోని పరిస్థితి. తామిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందన్న విషయాన్ని ఇలా చెప్పటంతో.. విషయం రచ్చ రచ్చగా మారింది. విషయం పోలీసు స్టేషన్ కు చేరింది. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేసినా.. వధువు ఎంతకూ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో.. వరుడు పెళ్లికుమార్తెను పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయాడు.
వధువు తల్లిదండ్రులు కూడా కూతుర్ని వదిలేసి వెళ్లిపోయారు. తనకు వంశీ అంటే ఇష్టమని.. ఇద్దరం ప్రేమించుకున్నట్లుగా లిఖితపూర్వకంగా రాసిచ్చింది. దీంతో.. ప్రస్తుతానికి ఆమెను కరీంనగర్ లోని స్వధార్ హోంకు తరలించారు. ముద్దు పెట్టుకొని వివాదానికి కారణమైన వంశీపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదంతా జరిగిన సమయంలో అతడు మద్యాన్ని సేవించి ఉండటం గమనార్హం. పెళ్లికుమార్తె ఇచ్చిన సమాచారంతోనే వంశీ వచ్చి.. వారిని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు. కానీ.. కని పెంచిన తల్లిదండ్రుల్ని.. పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది.
హుజూరాబాద్ కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కుర్రాడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెద్దలు అనుకున్న ముహుర్తానికే సోమవారం రాత్రి ధూంధాంగా పెళ్లి జరిగింది. అయితే.. ఆమె హుజూరాబాద్ కు చెందిన వంశీ అనే యువకుడ్ని ప్రేమించింది. వారిద్దరి ప్రేమకు బ్రేకులు వేసేలా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి.. బరాత్ ముగిసిన సోమవారం రాత్రి వరుడి ఇంటికి వెళ్లే వేళలో.. వారి వాహనాన్ని అడ్డగించాడు వంశీ.