Begin typing your search above and press return to search.

ట్రాన్స్ జెండర్లపై పరిశోధన.. షాకింగ్ ఫలితం

By:  Tupaki Desk   |   6 Aug 2019 1:02 PM IST
ట్రాన్స్ జెండర్లపై పరిశోధన.. షాకింగ్ ఫలితం
X
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘తమన్నా సింహాద్రి’ని చూశారా.? నిజానికి చిన్నప్పుడు తమన్నా ఒక మగపిల్లాడే.. కానీ ఆడవాళ్ల లక్షణాలు రావడంతో యవ్వనంలో ఉండగా ఆపరేషన్ చేయించుకొని హర్మోన్ల చికిత్స చేసుకొని అమ్మాయిగా మారిపోయానని ఇటీవల తన తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకుంది.. పురుష అవయవాలు తొలగించుకొని అంటే లింగమార్పిడి చేయించుకొని పూర్తి స్థాయిలో మహిళగా మారిపోయానని తెలిపింది.. అందుకే అతడిని ‘ట్రాన్స్ జెండర్’ అని పిలుస్తున్నారు.

ఇతడే కాదు.. ఎంతో మంది లింగమార్పిడి చేయించుకొని మహిళగా మారుతున్నారు. మరి మహిళలుగా మారిపోయారు సరే.. మరి పురుషుడికి వచ్చే కామక్రోదాలు అదేనండి ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారంటే.. వాటిని హర్మోన్ చికిత్సతోపాటు మగతనాన్ని అణిచివేసే మందులు కొద్దిరోజులు వాడి వీటిని కంట్రోల్ చేస్తారు.. కొన్ని రోజులు వాడాక ఆపేస్తారు. ఆ తర్వాత మహిళగానే ఈ ట్రాన్స్ జెండర్లు మారిపోతుంటారు.

అయితే మగతానాన్ని అణిచివేసే మందులు, హర్మోన్ చికిత్స ఆపేసిన తర్వాత కూడా ట్రాన్స్ జెండర్లలో కొత్త పరిణామం చోటుచేసుకుందని తాజాగా అమెరికాలోని మ్యాగీ-ఉమెన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తేల్చారు. ట్రాన్స్ జెండర్ లలో వీర్యం ఉత్పత్తి అవుతున్నట్టు గమనించారు.

వారి పరిశోధనలో భాగంగా తాజాగా లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తిరిగి సంతోనాత్పత్తి ని పొందడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యారని శాస్త్రవేత్తలు నివేదికలో తెలిపారు. హార్మోన్ చికిత్సను ఆపేసిన తర్వాత కూడా వీరిలో వీర్యం వృద్ధిని గుర్తించారు.

వీరిద్దరే కాదు.. లింగమార్పిడి చేయించుకొని హర్మోన్ చికిత్స తీసుకోని.. మగతనాన్ని తగ్గించే మందులవాడని 8మందిని పరీక్షించగా వీర్యం ఉత్పత్తిలో మార్పులేదని తెలిపారు. దీన్ని బట్టి లింగమార్పిడి చేయించుకొని ఆడవాళ్లుగా మారిన ట్రాన్స్ జెండర్లలో కొద్దికాలం తర్వాత మళ్లీ వీర్యం ఉత్పత్తి అవుతుందని.. దీన్ని బట్టి వీళ్లు పైకి కనిపిస్తున్నట్టు.. పూర్తి స్థాయిలో ఆడవాళ్లుగా మారడం కష్టమేనని శాస్త్రవేత్తలు తేల్చారు..