Begin typing your search above and press return to search.

టిక్ టాక్ స్టార్ రేప్ కేసు గురించి పోలీసులు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   21 April 2021 6:30 AM GMT
టిక్ టాక్ స్టార్ రేప్ కేసు గురించి పోలీసులు ఏం చెప్పారు?
X
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన భార్గవ్.. మాయ మాట‌ల‌తో ఓ బాలిక‌కు ద‌గ్గ‌రై, ఆ త‌ర్వాత అత్యాచారం చేశాడట‌. అన్న‌య్య అని పిలిచిన బాలిక‌పై.. ప‌లుమార్లు ఈ దారుణానికి ఒడిగ‌ట్ట‌డంతో బాధితురాలు గ‌ర్భ‌వ‌తి కూడా అయ్యిన‌ట్టు స‌మాచారం. దీంతో.. పోలీసులు భార్గ‌వ్ ను అరెస్టు చేశార‌ట‌. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను విశాఖ ఏసీపీ ప్రేమ్ కాజ‌ల్ మీడియాకు వెల్ల‌డించినట్టు తెలుస్తోంది.

విశాఖ జిల్లా సింహ‌గిరికి చెందిన 14 సంవ‌త్స‌రాల బాలిక‌.. సోష‌ల్ మీడియాలో భార్గ‌వ్ కు ప‌రిచ‌యం అయిన‌ట్టు తెలిసింది. స‌ద‌రు బాలికకు సైతం టిక్ టాక్ వీడియోల‌పై ఇంట్ర‌స్ట్ ఉండ‌డంతో.. త‌ర‌చూ చాటింగ్ చేసుకునేవాళ్ల‌ట‌. అయితే.. ఆ బాలిక భార్గ‌వ్ ను అన్న‌య్య అని పిలిచేద‌ని తెలిసింది. కానీ.. డైలీ చాటింగ్ లో మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డంతో.. ఆమెను స్టార్ ను చేస్తాన‌ని చెప్పాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే.. బాధితురాలిని భార్గ‌వ్ ప్రేమిస్తాన‌ని చెప్ప‌గా.. ఆమె అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో.. ఆమె దుస్తులు మార్చుకుంటున్న‌ప్పుడు తీసిన వీడియోలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని బెదిరించి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల స‌ద‌రు బాలిక ఆరోగ్యంలో తేడా రావ‌డంతో.. త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రిలో చూపించార‌ని, దీంతో.. ఆమె నాలుగు నెల‌ల‌ గ‌ర్భ‌వ‌తి అని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విష‌య‌మై న్యాయం చేయాల‌ని బాలిక త‌ల్లి ఈ నెల 16వ తేదీన పెందుర్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో.. పోలీసులు భార్గ‌వ్ పై రేప్ కేసు న‌మోదు చేశార‌ట‌.

అయితే.. మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం, ఫోక్సో చ‌ట్టం కింద కేసును విచారించాల్సి రావ‌డంతో విశాఖప‌ట్నం దిశ ఏసీపీ ప్రేమ్ కాజ‌ల్ రంగంలోకి దిగిన‌ట్టు స‌మాచారం. విచార‌ణ‌లో భార్గ‌వ్ నిందితుడిగా తేల‌డంతో.. అత‌న్ని అరెస్టు చేసి, కోర్టు ముందు హాజ‌రు ప‌రిచిన‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్ లో ఉన్న భార్గ‌వ్ ను విశాఖ తీసుకొచ్చార‌ని, నిందితుడికి కోర్టు 14 రోజుల వ‌ర‌కు రిమాండ్ విధించింద‌ని ఏసీపీ తెలిపి‌న‌ట్టు స‌మాచారం.