Begin typing your search above and press return to search.
కేయూ పరీక్షా పత్రాల్లో కేసీఆర్ , టీఆర్ఎస్ పై షాకింగ్ ప్రశ్నలు
By: Tupaki Desk | 17 Feb 2021 3:00 PM ISTతెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది విద్యార్థులే. ఆ తర్వాత దాన్ని ఉధృతం చేశాయి పార్టీలు. ముఖ్యంగా కేసీఆర్ ఈ ఉద్యమాన్ని నడిపించారు. రాజకీయంగా ఇప్పుడు సీఎంగా ఏలుతున్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ పై ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాకతీయ యూనివర్సిటీ ఎస్.డీ.ఎల్.సీ పరీక్షల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పై ఇచ్చిన ప్రశ్నలు విద్యార్థులను షాక్ కు గురిచేశాయి.
పరీక్షల్లో సిలబస్ తో సంబంధం లేకుండా ఇచ్చిన ప్రశ్నలను చూసి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అవాక్కయ్యారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కారణాలేమిటీ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమిటీ? వంటి ప్రశ్నలను ఇవ్వడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు.
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నలు చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర, టీఆర్‌ఎస్ విజయానికి కారణాలు, తెలంగాణలో కింది స్థాయి పాలనలో చేపట్టిన సంస్కరణలు, 1969 నాటి తెలంగాణ ఉద్యమం బలహీనపడడానికి కారణాలు తెలపాలంటూ అసంబద్ధ ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు వాపోయారు. సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు విమర్శించారు.
ఇక ఈ ప్రశ్నలపై పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రశ్నలు అడగడం ఏంటని.. ఇది గులాబీ పార్టీకి మేలు చేయడానికేనని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.