Begin typing your search above and press return to search.
కరోనా: మన పంచాంగం ముందే ఊహించింది
By: Tupaki Desk | 7 April 2020 8:00 PM ISTజ్యోతిష్య శాస్త్రం.. వివాహాలు, పెండ్లిలు, శుభకార్యాలను దీన్ని చూసే అంచనావేస్తారు. పంచాంగం లేనిదే కొందరు నమ్మకస్తులకు పూట కూడా గడవదు. అయితే దీన్ని నమ్మే వారు ఎంతమంది ఉన్నారో.. నమ్మని నాస్తికులు సమాజంలో బోలెడు మంది ఉన్నారు. హేతువాదులు జ్యోతిష్య శాస్త్రం వట్టి ట్రాష్ అంటారు. ఎవరి నమ్మకాలు వారివి.
అయితే తాజాగా ట్రెండింగ్ అవుతున్నది చూస్తే మన జ్యోతిష్యశాస్త్రం చెప్పింది నిజమేనని అనిపించకమానదు. నవంబర్ 2019-ఏప్రిల్ 2020 మధ్య మానవాళికి విపత్తు వస్తుందని పిల్ల జ్యోతిష్యుడు అభిజ్ఞ గత ఆగస్టు 2019లోనే ఒక వీడియోలో చెప్పాడు. అయితే ఇది చాలామంది యాదృశ్చికంగా కొట్టిపారేసినా.. ఇప్పుడు కరోనా రావడంతో అభిజ్ఞ జ్యోతిష్యంపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. నమ్మకం ఏర్పడుతోంది. వైరల్ అవుతోంది.
ఇక ఆరు నెలల క్రితం 2020-21 శార్వారీ పంచాంగం లో శ్రీనివాస గార్గేయ అనే మరో తెలుగు జ్యోతిష్యుడు కూడా ప్రపంచం ఈ సంవత్సరం దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించాడు. అదిప్పుడు కరోనాతో నిజమైంది. ప్రజలు పండుగలు కూడా జరుపుకోని పరిస్థితి ఏర్పడుతుందన్నాడు.. ఇప్పుడు కరోనాతో ఉగాది, శ్రీరామనవమిని జరుపుకోలేదు.
కాబట్టి ఈ తెలుగు జ్యోతిష్యంపై నమ్మకం ఏర్పడుతోంది. 10-12 నెలల తర్వాత జరిగేదాన్ని ఊహించి చెప్పిన వైనం వైరల్ అవుతోంది. కాబట్టే వచ్చే కొన్ని రోజులు జనాలు కూడా కరోనా తో మానసికంగా ఇంట్లో ఉంటేనే బెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.