Begin typing your search above and press return to search.

షాకింగ్: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం.. చేసిందెవరంటే?

By:  Tupaki Desk   |   2 Aug 2022 10:55 AM IST
షాకింగ్: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం.. చేసిందెవరంటే?
X
షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. రాజకీయంగా విభేదాల్ని వ్యక్తిగతంగా తీసుకొని.. ప్రాణహాని కల్పించటానికైనా వెనుకాడని రాజకీయం తెలంగాణలో తాజాగా వెలుగు చూసింది.

సోమవారం ఒక్కరోజులోనే తెలంగాణలో జరిగిన రెండు దారుణ హత్యలు సంచలనంగా మారగా.. తాజాగా మరో హత్యాయత్నం షాకింగ్ గా మారింది. ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చంపేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని తాజాగా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవనరెడ్డి నివాసం ఉంటారు. ఆయన్ను హత్య చేసేందుకు ఆయన నియోజకవర్గానికి చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రయత్నం చేయటం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకోగా.. షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతో కక్ష పెంచుకున్న మాజీ సర్పంచ్ భర్త ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు పథకం వేసుకొని హైదరాబాద్ కు వచ్చారు.

ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడ్ని అనుమానించిన ఎమ్మెల్యే సిబ్బంది ఆ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో తాను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు వచ్చినట్లుగా గుర్తించారు. అతడి వద్ద నుంచి కత్తి.. పిస్టోల్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు