Begin typing your search above and press return to search.
ప.గోలో దారుణం.. సారా మత్తులో కొడుకును.. భార్యను నరికేశాడు
By: Tupaki Desk | 19 Nov 2020 12:30 PM ISTపూటుగా తాగేశాడు. తలకు ఎక్కిన మత్తు మదంతో విచక్షణ కోల్పోయాడు. చేతికి వచ్చిన కొడుకును చేతులారా చంపుకున్న దుర్మార్గం తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. రాంబాబుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లిళ్లకు వంట చేస్తుంటాడు. సొంతిల్లు ఉన్న ఇతడి కుటుంబం ఒక పోర్షన్ లో ఉంటే.. పెద్ద కొడుకు.. అతని భార్య మరో పోర్షన్ లో ఉంటారు. పెళ్లి కాని చిన్న కొడుకుతో కలిసి ఉంటారు.
కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తాగుడుకు బానిస అయిన రాంబాబు.. ఎక్కువగా తాగి వస్తున్నాడు. మంగళవారం రాత్రి నాటుసారా తాగి వచ్చిన రాంబాబు.. చిన్నకొడుకుతోనూ.. భార్యతోనూ గొడవపడ్డాడు. చూస్తుండగానే గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో విచక్షణ కోల్పోయిన రాంబాబు చేతికి అందిన గొడ్డలితో విరుచుకుపడ్డాడు.
తానేం చేస్తున్నానో తెలీని ఆవేశంతో చేసిన పనికి చిన్న కొడుకు గొడ్డలి గాయాలకు కుప్పకూలిపోతే.. భార్య సైతం తీవ్రమైన గాయాలతో పడిపోయింది. ఈ గొడవను చూసిన పెద్ద కొడుకు.. స్థానికులు కలిసి రాంబాబును బలవంతంగా నిలువరించారు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చారు. 108 సిబ్బంది వచ్చేసరికి చిన్న కొడుకు అప్పటికే మరణించగా.. భార్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.